తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Pawankalyan Will Stay In Mangalagiri And Reviews Arrangments For Party Foundation Day In Machilipatnam

Janasena Foundation Day :బందరులో ఆవిర్భావ సభ…మంగళగిరికి జనసేనాని..

HT Telugu Desk HT Telugu

10 March 2023, 11:24 IST

    • Janasena Foundation Day : పదో ఆవిర్భావ సభను కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించేందుకు జనసేన పార్టీ నిర్ణయించింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారమే మంగళగిరి చేరుకుంటారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena Foundation Day జనసేన పదో ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాలుగు రోజులపాటు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బసచేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

NEET UG Admit Card 2024 : నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య

పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి పలు ముఖ్య సమావేశాలు, సమీక్షల్లో పాల్గొంటారని తెలిపారు. 11వ తేదీన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరికి చేరుకుంటారు. 11వ తేదీమధ్యాహ్నం 2 గంటలకు బీసీ సంక్షేమంపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమాన్నినిర్వహిస్తారు.

12వ తేదీ ఉదయం 11గంటలకు పార్టీ రాష్ట్ర నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు. పార్టీలో పలువురి చేరికలు ఉంటాయని పార్టీ నేతలు వివరించారు. 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో భేటీ అవుతారు.

13వ తేదీ ఉదయం 11గంటలకు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ ఉంటుంది.

14వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి మచిలీపట్నం సభకు బయలుదేరుతారు. 2 గంటలకు విజయవాడ ఆటోనగర్ గేట్ దగ్గర పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలుకుతారు. తాడిగడప జంక్షన్, పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్, పామర్రు, గుడివాడ బైపాస్ మీదుగా 5గంటలకు మచిలీపట్నం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు.

టాపిక్