తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ‍Nwc Notice To Apdgp : సిఐ అంజూ యాదవ్‌పై కేసు నమోదు చేయాలన్న మహిళాకమిషన్

‍NWC Notice To APDGP : సిఐ అంజూ యాదవ్‌పై కేసు నమోదు చేయాలన్న మహిళాకమిషన్

HT Telugu Desk HT Telugu

04 October 2022, 12:55 IST

    • ‍NWC Notice To APDGP తిరుపతి జిల్లాలో మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించిన మహిళా సిఐ అంజూ యాదవ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్‌ ఏపీ డిజిపిని ఆదేశించింది. రెండ్రోజుల క్రితం శ్రీకాళహస్తిలో భర్త అచూకీ కోసం మహిళపై దాడి చేసి వివస్త్రను చేసిన ఘటనలో సిఐ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 
అంజు యాదవ్‌పై కేసు నమోదు చేయాలని మహిళా కమిషన్ ఆదేశం
అంజు యాదవ్‌పై కేసు నమోదు చేయాలని మహిళా కమిషన్ ఆదేశం

అంజు యాదవ్‌పై కేసు నమోదు చేయాలని మహిళా కమిషన్ ఆదేశం

‍NWC Notice To APDGP రాత్రి సమయంలో మహిళపై దాడి చేసి బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లిన సిఐ అంజూ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండ్రోజుల క్రితం మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలో ఓ వ్యక్తిని శ్రీకాళహస్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి తప్పించుకోవడంతో అతని భార్యను బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లారు. సిఐ అంజూ యాదవ్‌ మహిళపై దాడి చేసి ఒంటిపై బట్టలు పీకేసి రచ్చ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

మహిళపై సిఐ అంజూయాదవ్‌ దాడి ఘటన సంచలనం సృష్టించింది. అంజూ యాదవ్ తీరును మహిళా సంఘాలు పార్టీలకు అతీతంగా తప్పు పట్టాయి. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సైతం సిఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసు అధికారి తీరుపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. శ్రీకాళహస్తిలో హోటల్‌ నడుపుకునే మహిళపై మహిళా పోలీసు అధికారి దారుణంగా వ్యవహరించిన తీరును సీరియస్‍గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.

సిఐ అంజుయాదవ్‌ తీరుపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ఫిర్యాదుకు స్పందించిన మహిళా కమిషన్ రాష్ట్ర డిజిపి నోటీసులు జారీ చేసింది. ఘటనకు బాధ్యులైన మహిళా పోలీస్ అధికారిపై FIR నమోదు చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. - ఘటనపై నిర్దేశిత కాలపరిమితితో దర్యాప్తు చేయాలని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌ ఆదేశించారు. బాధిత మహిళకు వైద్య సౌకర్యాలు కల్పించాలని డిజిపిని కమిషన్ ఆదేశించారు. అంజు యాదవ్‌పై వచ్చిన ఫిర్యాదుపై కమిషన్‌ స్పందననను జాతీయ మహిళా కమిషన్ ఛైర్‍పర్సన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మరోవైపు శ్రీకాళహస్తిలో సిఐ అంజుయాదవ్‌‌ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతి అర్బన్‌ ఎస్పీ పరమేశ్వరరెడ్డి విచారణకు ఆదేశించారు. తిరుపతి అదనపు ఎస్పీ విమలకుమారిని విచారణ అధికారిగా నియమించారు. బాధిత మహిళ ధనలక్ష్మీ వాంగ్మూలాన్ని పోలీసులు సేకరించారు. వివాదాస్పద సిఐ అంజు యాదవ్‌పై కఠిన చర్యలు తప్పవని పోలీస్ అధికారులు చెబుతున్నారు.