తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nia Court On Jagan Case : విచారణకు జగన్ రావాల్సిందే… ఎన్‌ఐఏ కోర్ట్

NIA Court On Jagan Case : విచారణకు జగన్ రావాల్సిందే… ఎన్‌ఐఏ కోర్ట్

HT Telugu Desk HT Telugu

31 January 2023, 15:33 IST

    • NIA Court On Jagan Case  విశాఖ విమానాశ్రయంలో ఏపి సిఎం జగన్మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడి ఘటనలో విజయవాడ ఎన్‌‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. కేసు విచారణలో భాగంగా  ఫిబ్రవరి 15న ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కోర్టు విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు వ్యక్తిగత కారణాలతో విశాఖ ఎయిర్‌పోర్ట్‌ కమాండెంట్‌ విచారణకు హాజరు కాకపోవడంతో తదుపరి విచారణకు హాజరవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. 
సీఎం జగన్
సీఎం జగన్

సీఎం జగన్

NIA Court On Jagan Case ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో ఎన్‌ఐఏ కోర్టు విచారణ ప్రారంభించింది. మరోవైపు ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసులో, బాధితుడు జగన్‌ను కూడా విచారించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. జగన్మోహన్ రెడ్డిని కోర్టులో హాజరు పరచాలని జడ్జిఆదేశించారు. ఈ మేరకు ఎన్‌ఐఏను ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

జగన్ కోర్టుకు వచ్చేలా విక్టిమ్ షెడ్యూల్‌ను రూపొందించాలని ఎన్ఐఏకు ఆదేశాలు జారీచేసింది. విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో జరిగిన దాడి కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

️ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. దాాదపు నాలుగేళ్లుగా నిందితుడు రిమాండ్‌లోనే ఉన్నాడు. ️ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో కొనసాగుతోంది. కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణకు జగన్‌ను కూడా కోర్టులో హాజరుపరచాలని ఎన్ఐఏను న్యాయస్థానం ఆదేశించింది.

జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ రాఘవ విచారణకు హాజరు కాకపోవడంతో కేసుకు సంబంధించి మొత్తం ట్రయల్ షెడ్యూల్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. సాక్షిగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌ అధికారి తండ్రి చనిపోవడంతో విచారణకు రాలేకపోయారని ఎన్‌ఐఏ న్యాయవాది వివరించారు. మరోవైపు విక్టిమ్ షెడ్యూల్ కూడా ఖరారు చేసి వచ్చే విచారణకు హాజరు పరచాలని కోర్టు ఆదేశించింది.

️కోడికత్తితో దాడి కేసులో బాధితుడు జగన్ కావడంతో ఆయన కూడా కోర్టుకు వచ్చేలా షెడ్యూల్ ను రూపొందించాలని ఎన్ఐఏను జడ్జి ఆదేశించారు. కేసు విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసిన కోర్టు ఆరోజు విచారణకు జగన్ రావాలని ఆదేశాలు జారీ చేశారు.

టాపిక్