తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Nara Lokesh Called To Raise Tdp Flag Without Fear Of Police Cases

LokeshYuvagalam :కేసులకు భయడకుండా టీడీపీ జెండా ఎగురవేయాలన్న లోకేష్

HT Telugu Desk HT Telugu

08 March 2023, 7:32 IST

    • LokeshYuvagalamయువగళంలో టపాసులు కాల్చినందుకు కూడా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిపై పోలీసులు కేసులు పెట్టారని, ఏదో ఒక కేసు పెట్టి మిమ్మల్ని భయపెట్టాలని జగన్ ప్రభుత్వం, వైసీపీ నాయకులు చూస్తారని, ఎవరూ భయపడొద్దని నారా లోకేష్ సూచించారు. పీలేరులో తెలుగుదేశం జెండా ఎగరేయాలన్నారు. 
యువగళం పాదయాత్రలో  నారా లోకేష్
యువగళం పాదయాత్రలో నారా లోకేష్

యువగళం పాదయాత్రలో నారా లోకేష్

LokeshYuvagalam : నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 37వరోజు పీలేరు నియోజకవర్గం కలికిరి ఇందిరమ్మనగర్ నుంచి ప్రారంభమైంది.

ట్రెండింగ్ వార్తలు

AP TS Summer Updates: పగటిపూట బయట తిరగకండి, ముదురుతున్న ఎండలు… వడదెబ్బకు ప్రాణాలు విలవిల

AP EMRS Inter Admissions : ఏపీ ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు-మే 3 నుంచి దరఖాస్తులు ప్రారంభం

AP Govt Salaries: ఎలక్షన్ ఎఫెక్ట్‌... ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, సర్వీస్ పెన్షన్లు... ఐదేళ్లలో ఇదే రికార్డ్

Papikondalu Tour Package : గోదావరిలో పాపికొండల మధ్య బోటు ప్రయాణం- రాజమండ్రి నుంచి ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

సోమవారం కలికిరిలో లోకేష్‌కు భారీఎత్తున స్వాగతం పలికి టిడిపిలో చేరిన సర్పంచ్ ప్రతాప్ కుమార్ రెడ్డిపై కక్షసాధింపు చర్యలకు దిగారు. కలికిరిలో పర్యటన సందర్భంగా బాణాసంచా కాల్చారంటూ పీలేరు ఇన్ చార్జి కిషోర్ కుమార్ రెడ్డి, కలికిరి సర్పంచ్ ప్రతాప్ కుమార్ రెడ్డి, మరికొందరిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. పాదయాత్ర సందర్భంగా విద్యార్థులు, యువకులు యువనేతను కలస్తుండటంతో అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వక్ఫ్ ఆస్తులను వైసీపీ నాయకుల యథేచ్చగా దోచుకుంటున్నారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆస్తుల పరిరక్షణకు వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ పవర్స్ ఇస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ ప్రకటించారు. పీలేరు నియోజకవర్గం కలికిరి పంచాయతీ ఇందిరా నగర్ సమీపంలో మైనారిటీలతో నారా లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్లో ఒక్క బటన్ నొక్కగానే దూదేకుల కులం వారికి బీసీ సర్టిఫికేట్ అందేలా చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి ముస్లీం లకు ప్రత్యేకంగా భూములు కేటాయిస్తామన్నారు. పీలేరు లో ఉన్న ఏపిఐఐసి భూముల్లో పరిశ్రమలు తీసుకొచ్చి మైనార్టీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మైనారిటీల సంక్షేమం కోసం భారతదేశంలోనే మొదటిసారిగా కార్పొరేషన్ ను పెట్టిన ఘనత టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావుదని దాన్ని కొనసాగిస్తూ మైనారిటీలను పేదరికం నుండి దూరం చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేశారని చెప్పారు. ముస్లీంలకు రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య లాంటి పథకాలు అమలు చేసింది టిడిపి అని ముస్లింలకు మసీదులు, ఈద్గా ల అభివృద్ది కి నిధులు కేటాయించింది టిడిపి అన్నారు.జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మైనార్టీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దూదేకుల కులానికి చెందిన వారికి బీసీ సిర్టిఫికట్ ఇవ్వకుండా వైసిపి ప్రభుత్వం వేధిస్తుందని లోకేష్ ఆరోపించారు.

నేడు పాదయాత్ర సాగుతుంది ఇలా

నారా లోకేష్ ఇప్పటివరకు 483.6 కి.మీ దూరం నడిచారు. మంగళవారం 10.9 కి.మీ దూరం పాదయాత్ర నిర్వహించారు. యువగళం పాదయాత్ర 38వ రోజు బుధవారం పీలేరు నియోజకవర్గంలో సాగనుంది.

ఉదయం

8.00 – చింతపర్తిలోని బోయపల్లి క్రాస్ వద్ద విడిది కేంద్రంలో మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు.

9.00 – బోయపల్లి క్రాస్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

11.00 – విటలం గ్రామంలో స్థానికులతో మాటామంతీ.

12.00 – పునుగుపల్లిలో స్థానికులతో సమావేశం.

12.20 – పునుగుపల్లిలో భోజన విరామం.

సాయంత్రం

2.30 – పునుగుపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.

3.00 – వాయల్పాడులో మైనారిటీలతో సమావేశం.

3.25 – వాయల్పాడు ఆర్టీసి బస్టాండు వద్ద స్థానికులతో మాటామంతీ.

5.00 – మదనపల్లి నియోజకవర్గంలో ప్రవేశం.

6.30 – మదనపల్లి రూరల్ మండలం పూలవాండ్లపల్లి వద్ద విడిది కేంద్రంలో బస చేస్తారు.

టాపిక్