తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Minster Botsa Satyanarayana Comments On Govt Employees

Minster Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్య పరిష్కరించుకునే సహనం ఉండాలి

HT Telugu Desk HT Telugu

27 November 2022, 21:52 IST

    • Botsa Satyanarayana On Employees : వైసీపీ ప్రభుత్వానికి కళ్లు, చెవులు గ్రామ సచివాలయాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగులపై ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని చెప్పారు.
మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ

మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ(Vijayawada) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ప్రథమ మహా జనసభ కార్యక్రమంలో మంత్రి బొత్సతోపాటుగా మంత్రి సురేశ్(Minister Botsa) పాల్గొన్నారు. ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు, ఉద్యోగులు హాజరయ్యారు. ఉద్యోగుల(Employees)పై ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వంలో అవినీతి జరిగితే ఉద్యోగులు, సీఎం(CM) తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. వైసీపీ(YSRCP) ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

NEET UG Admit Card 2024 : నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య

'ఉద్యోగులకు ఏ సమస్య ఉన్నా కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. ఉద్యోగులంటే ప్రభుత్వానికి వ్యతిరేకత లేదు. సర్వీస్‌ నిబంధనల ప్రకారం సమస్యలను ప్రభుత్వం(Govt) దృష్టికి తీసుకురావాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను మంత్రుల కమిటీ(Ministers Committee)లో చర్చించి పరిష్కరిస్తాం. అవసరమైతే కాళ్లు పట్టుకుని సమస్య పరిష్కరించుకునే సహనం ఉద్యోగ సంఘాలకు ఉండాలి.' అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.

సమస్యల పరిష్కారంలో సామ, దాన, భేద దండోపాయాలు ఉంటాయని మంత్రి బొత్స(Minister Botsa) అన్నారు. ఉద్యోగ సంఘాలు నేరుగా దండోపాయానికి ప్రయత్నించడం సరికాదని చెప్పారు. సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు గ్రామ సచివాలయా(Sachivalayam)లేనని బొత్స స్పష్టం చేశారు. గ్రామ సచివాల ఉద్యోగుల, నిబద్ధత, నిజాయితో పనిచేస్తున్నారన్నారు. అవినీతికి తావులేకుండా సచివాలయాల్లో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

'ప్రభుత్వానికి కళ్లు, చెవులు గ్రామ సచివాలయాలే. గ్రామ సచివాలయ ఉద్యోగులు(Sachivalayam Employees), నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తున్నారు. అవినీతికి లేకుండా సచివాలయాల్లో పనులు జరుగుతున్నాయి. నీతి ఆయోగ్‌(NITI AAYOG) బృందం సచివాలయ వ్యవస్థను అభినందించింది. రైతు భరోసా(Rythu Bharosa) కేంద్రాలను దేశం అంతటా ఏర్పాటు చేయాలి. సచివాలయ ఉద్యోగులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుంది.' అని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో 500 కంటే ఎక్కువ సేవలు ఉన్నాయని మంత్రి ఆదిమూలపు సురేశ్(Adimulapu Suresh) అన్నారు. సర్వీస్ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు పదోన్నతలు ఉంటాయన్నారు. ఉద్యోగుల పదోన్నతుల కోసం రోడ్ మ్యాప్(Road Map) రెడీ అవుతుందన్నారు. శానిటేషన్ ఉద్యోగులకు వీక్లీ ఆఫ్(Weekly Off) త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ఒకేసారి లక్ష 35 వేల ఉద్యోగాలు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు సీఎం జగన్(CM Jagan) మానస పుత్రికలు అని పేర్కొన్నారు. సచివాలయాల ఏర్పాటు అనేది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.