తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Manchu Manoj : మంచు ఫ్యామిలీ ఇష్యూలో మరో ట్విస్ట్.. జనసేనలోకి మోహన్‌బాబు కొడుకు, కోడలు!

Manchu Manoj : మంచు ఫ్యామిలీ ఇష్యూలో మరో ట్విస్ట్.. జనసేనలోకి మోహన్‌బాబు కొడుకు, కోడలు!

16 December 2024, 11:08 IST

google News
    • Manchu Manoj : మంచు ఫ్యామిలీ ఇష్యూ రచ్చ రచ్చ అయ్యింది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కి.. కోర్టు వరకు వెళ్లింది. అక్కడి నుంచి ఆసుపత్రికి చేరింది. తాజాగా.. రాజకీయాల వరకు వచ్చింది. అవును.. మంచు ఫ్యామిలీ మెంబర్స్ కొందరు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
జనసేనలోకి మోహన్‌బాబు కొడుకు, కోడలు!
జనసేనలోకి మోహన్‌బాబు కొడుకు, కోడలు!

జనసేనలోకి మోహన్‌బాబు కొడుకు, కోడలు!

ప్రముఖ నడుటు మంచు మోహన్‌బాబు కొడుకు, కోడలు జనసేన పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. మోహన్‌బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్, అతని భార్య మౌనిక జనసేనలో చేరబోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇవాళ (సోమవారం) ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. 1000 కార్లతో ఆళ్లగడ్డకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. భూమా ఘాట్‌లో రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటించే అవకాశం ఉంది.

మనోజ్ పొలిటికల్ ఎంట్రీతో మంచు ఫ్యామిలీ వ్యవహారాలు కొత్త టర్న్ తీసుకోనున్నాయి. తాజా వివాదంతో రాజకీయంగా బలపడాలని మంచు మనోజ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నంద్యాల నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మంచు మనోజ్, మౌనిక నిర్ణయంపై సినీ, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

గట్టిపట్టు..

కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది. ముఖ్యంగా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో భూమా వర్గం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. భూమా నాగిరెడ్డి, శోభ మృతిచెందిన తర్వాత.. భూమా అఖిలప్రియ రాజకీయ ఆరంగ్రేటం చేశారు. తొలుత మంత్రి అయ్యారు. 2019లో ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో అక్క బాటలో నడవాలని చెల్లి మౌనిక నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా ఆమెను ప్రోత్సహించాలని మంచు మనోజ్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే.. టీడీపీలో కాకుండా జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మెగా ఫ్యామిలీతో సంబంధాలు..

మంచు మనోజ్ సంగతి ఎలా ఉన్నా.. మెగా కుటుంబంతో భూమా ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి. 2009 ఎన్నికలకు ముందు భూమా నాగిరెడ్డి దంపతులు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పుడు రాయలసీమలో చిరంజీవికి నాగిరెడ్డి అండగా నిలబడ్డారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. భూమా దంపతులు వైసీపీలో చేరారు. కానీ.. చిరంజీవితో మంచి సంబంధాలు కొనసాగించారు. దీంతో టీడీపీ కంటే జనసేనలో చేరితే బాగుంటుందని మనోజ్, మౌనిక భావించినట్టు తెలుస్తోంది.

ఫ్యామిలీలో వివాదం..

మంచు ఫ్యామిలీలో వివాదం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. గత ఆదివారం మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. సోమవారం ఇద్దరూ పోలీసులకి ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత మంగళవారం రాత్రి మోహన్ బాబు ఇంట్లోకి గేటు తోసుకుంటూ ప్రవేశించిన మంచు మనోజ్.. ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాడు. మనోజ్ వెంట వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడిచేయడం.. ఆపై కేసు నమోదుతో ఇప్పుడు అరెస్ట్ కత్తి మోహన్ బాబుపై వేలాడుతోంది.

మంచు కుటుంబ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. మంచు ఫ్యామిలీలో మరో వివాదం తెరపైకి వచ్చింది. శనివారం తన కుటుంబంలో జరిగిన మరో ఘటన గురించి మనోజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మంచు విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేశారని ఆరోపించారు.

జర్నలిస్టుకు క్షమాపణలు..

హైదరాబాద్ జల్ పల్లిలోని తన ఇంటి వద్ద మీడియాపై దాడి ఘటనపై సినీ నటుడు మోహన్ బాబు మరోసారి క్షమాపణలు చెప్పారు. ఆదివారం సాయంత్రం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును మంచు మోహన్ బాబు, మంచు విష్ణు పరామర్శించారు. జర్నలిస్టు కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని వివరణ ఇచ్చారు.

తదుపరి వ్యాసం