Hyderabad : కాలికి గాయం.. ఆసుపత్రిలో చేరిన హీరో మంచు మనోజ్.. వీడియోలు వైరల్-hero manchu manoj admitted to hospital in hyderabad for treatment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : కాలికి గాయం.. ఆసుపత్రిలో చేరిన హీరో మంచు మనోజ్.. వీడియోలు వైరల్

Hyderabad : కాలికి గాయం.. ఆసుపత్రిలో చేరిన హీరో మంచు మనోజ్.. వీడియోలు వైరల్

Basani Shiva Kumar HT Telugu
Dec 08, 2024 05:42 PM IST

Hyderabad : మంచు మనోజ్ హాస్పిటల్‌లో చేరారు. అతని కాలికి గాయం కావడంతో.. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారు. అటు మంచు ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కినట్టు ప్రచారం జరుగుతోంది. మనోజ్, మోహన్ బాబు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరి ఇష్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

ఆసుపత్రిలో మంచు మనోజ్
ఆసుపత్రిలో మంచు మనోజ్

హీరో మంచు మనోజ్ ఆస్పత్రిలో చేరారు. కాలికి గాయం కావడంతో హాస్పిటల్‌లో చేరినట్టు తెలుస్తోంది. ఉదయం మోహన్‌బాబు, మంచు మనోజ్ మధ్య వాగ్వాదం జరిగిందని వార్తలు వచ్చాయి. మోహన్‌బాబు అనుచరుడు దాడి చేసినట్టు మనోజ్ ఆరోపణలు చేశారు. అటు మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు చర్చనీయాంశంగా మారాయి.

నటుడు మోహన్ బాబుపై కొడుకు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. తండ్రి తనని కొట్టాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే.. మనోజే తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. ఆస్తుల, స్కూలు వ్యవహారంలో పరస్పరంగా దాడులు జరిగినట్టు తెలుస్తోంది. మనోజ్ గాయాలతోనే పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తనతో పాటు తన భార్యపై దాడి చేశారని మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారు.

మంచు ఫ్యామిలీలో వివాదాలు అంటూ వస్తున్న వార్తలపై.. మోహన్ బాబు కుటుంబం స్పందించింది. అసత్య ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఆదివారం సాయంత్రం మనోజ్‌ కాలి గాయంతో ఆస్పత్రికి రావడం చర్చనీయాంశమైంది. మోహన్‌బాబు, మనోజ్‌లు పరస్పరం ఒకరిపై ఒకరు డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేశారని పోలీసులు చెబుతున్నారు. స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని ఇరువురికీ సూచించినట్టు పోలీసులు వెల్లడించారు.

మంచు మోహ‌న్‌ బాబు వార‌సులు విష్ణు, మ‌నోజ్‌ మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు ఉన్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మంచు మ‌నోజ్ పెళ్లి నుంచి విభేదాలు తారాస్థాయికి చేరిన‌ట్లు టాక్ ఉంది. మ‌నోజ్ పెళ్లిలో విష్ణు ఎక్కువ‌గా క‌నిపించ‌క‌పోవ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ త‌ర్వాత మ‌నోజ్ సంబంధీకుల‌పై విష్ణు దాడిచేసిన వీడియో అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యింది.

ఈ వీడియోను స్వ‌యంగా మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ త‌ర్వాత డిలేట్ చేశాడు. ఈ గొడ‌వ‌ల వ‌ల్ల మంచు ఫ్యామిలీ రెండుగా విడిపోయిన‌ట్లు ప్రచారం జరిగింది. మోహ‌న్‌బాబు, విష్ణు ఒక‌టిగా క‌నిపిస్తున్నారని.. మ‌నోజ్, ల‌క్ష్మి క్లోజ్‌గా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Whats_app_banner