Gunde Ninda Gudi Gantalu: మీనా చేతి వంటకు బాలు బెండు - మనోజ్‌ను గట్టెక్కించిన ప్రభావతి - రోహిణికి పంచ్
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 12 ఎపిసోడ్‌లో బాలుకు ఇష్టమని మీనా చేపల కూర ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది. మీనా చేతి వంట తిననని బాలు బెట్టుచేస్తాడు. కానీ బాలు స్నేహితులు మాత్రం మీనా చేసిన చేపల కూర బాగుందంటూ తెగ పొగుడుతారు.
Gunde Ninda Gudi Gantalu: రోహిణిని డబ్బుల కోసం వర్ధన్ బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఆ డబ్బులు ఎలా అడ్జెస్ట్ చేయాలో తెలియక మనోజ్‌ను అడుగుతుంది రోహిణి. తమ ఆఫీస్‌లో ఇచ్చే బోనస్‌ను నీకు ఇస్తానని రోహిణితో అబద్ధం ఆడుతాడు మనోజ్. ఆ డబ్బులను ప్రభావతిని ఇమ్మని బతిమిలాడుతాడు.
రోహిణి కష్టాల్లో ఉండటం చూడలేక ఆమె అడిగిన డబ్బును ఎలాగైనా అడ్జెస్ట్ చేయాలని ప్రభావతి అనుకుంటుంది. కామాక్షిని అప్పు అడుగుతుంది. తన దగ్గర అంత డబ్బు లేదని, ఇరవై ఐదు వేలు మాత్రమే సర్ధుబాటుచేయగలనని ప్రభావతితో అంటుంది కామాక్షి.
రవి, శృతి ఇంటికి వస్తే....
రోజు రోజుకు డబ్బులకు ఇబ్బంది అవుతుందని, పది, పరకకు కూడా అప్పులు చేయాల్సివస్తోందని ప్రభావతి ఆవేదనకు లోనవుతుంది. రవి, శృతి తిరిగి మీ ఇంటికొస్తే నీ కష్టాలు మొత్తం దూరవుతాయని ప్రభావతికి కామాక్షి సలహా ఇస్తుంది.
శృతి తండ్రి కోట్ల ఆస్తులు ఉన్నాయని, శృతిని మంచి చేసుకుంటే అప్పులు చేయాల్సిన అవసరాలు ఉండవని, నువ్వే వడ్డీలకు డబ్బులు తిప్పొచ్చని కామాక్షి అంటుంది. ఈ విషయంలో నువ్వు ఆలస్యం చేస్తే శృతి ...రవిని ఇల్లరికం తీసుకుపోతుందని భయపెడుతుంది.
మేలు చేసిన మీనా...
ఒక రకంగా మీనా నీకు మేలు చేసిందని, నువ్వు కోరుకున్న సంబంధాల కంటే మీనానే గొప్పింటి సంబంధం చూసి రవికి పెళ్లి జరిపించిందని ప్రభావతితో అంటుంది. మీనాను తన ముందు కామాక్షి పొగడటం ప్రభావతి సహించలేకపోతుంది. తన ముందు మీనా పేరు ఎత్తద్దని అంటుంది. మీనాపై భర్తతో పాటు బాలు, మనోజ్ కోపంగా ఉన్నారని, వారందరిని ఒప్పించి రవిని ఇంటికి పిలిపించడం ఎలా అని ఆలోచిస్తుంది.
మీనాను పెళ్లి చేసుకోవడం అదృష్టం...
మీనాపై కోపంతో టిఫిన్ చేయకుండా వస్తాడు బాలు. ఆకలిని తట్టుకోలేక మూడు టీలు తాగేస్తాడు. తలనొప్పిగా ఉందని టీ తాగుతున్నానని కవర్ చేయబోతాడు. పెళ్లాం మీద అలిగి కడుపుమాడ్చుకోవడం ఎందుకు...టీమీద ప్రతాపం చూపించడం ఎందుకు అతడి బాలును అతడి స్నేహితులు అటపట్టిస్తారు. మీనాలాంటి అమ్మాయి నీకు భార్యగా దొరకడం నీ అదృష్టం అని రాజేష్ అంటాడు.
మీనాను పెళ్లిచేసుకోవడమే తాను చేసిన తప్పు అని బాలు వాదిస్తాడు. రవి పెళ్లి చేసి ఇంట్లో వాళ్లందరికి నిద్ర లేకుండా చేసిందని బాలు నిందలు వేస్తాడు. రవి తప్పు చేసి మీనాను దోషిని చేశాడని రాజేష్ అంటాడు. మీనానే తెలివిగా నేను ఇంట్లో లేని టైమ్ చూసి పెళ్లి చేసిందని అంటాడు. మీనా ఇంట్లో ఎవరి మాట వినదని, తనకు నచ్చిందే చేస్తుంది...నచ్చినట్లే ఉంటుంది. పిచ్చి పీక్స్‌లో ఉంటుందని మీనాను నానా మాటలు అంటాడు బాలు.
బాలుకు ఎదురొచ్చిన మీనా...
పెళ్లాం తెచ్చిన తలనొప్పి పోవాలంటే ఈ రోజు ఎన్ని టీలు అయినా తాగాల్సిందేనని మరో టీ తాగడానికి వెళ్లబోతాడు బాలు. మీనా అతడికి ఎదురొస్తుంది. శుభమా అంటూ టీ తాగడానికి ఎదురొస్తే నల్లపిల్లిలా ఎదురొచ్చిందని మీనాపై సెటైర్లు వేస్తాడు బాలు.
మీనా ఏదో మాట్లాడబోతుందటే నాతో మాట్లాడొద్దని చెప్పమని బాలు కోపంగా రాజేష్‌తో అంటాడు. వెధవలతో మాట్లాడి టైమ్ ఎందుకు వేస్ట్ చేసుకుంటావని రాజేష్ కూడా బాలుపై సెటైర్ వేస్తాడు.
బాలు కోసం భోజనం...
బాలు కోసం భోజనం తీసుకొస్తుంది మీనా. నా ఆకలి ఎప్పుడో చచ్చిపోయిందని మీనాతో చెప్పమని రాజేష్‌తో అంటాడు బాలు. బాలు తిననని బెట్టు చేస్తాడు. నన్ను వలలో పడేయ్యడానికి మీనా వేస్తున్న ప్లాన్ ఇదని తన స్నేహితులతో చెబుతాడు బాలు. మీ కోసం ఇష్టంగా చేపల కూర తెచ్చానని మీనా అంటుంది. నువ్వు ఎంత సేపు ఇక్కడ ఎదురుచూసినా నువ్వు తెచ్చిన క్యారేజీ వైపు కన్నెత్తి చూడనని బాలు ఛాలెంజ్ చేస్తాడు.
మీనాపై పొగడ్తలు...
నువ్వు తినకపోతే క్యారేజీ ఖాళీ చేసేవారు లేరనుకున్నావా అని మీనా అంటుంది. బాలు స్నేహితులు తాము తింటామని అంటారు. చేపల కూర టేస్ట్ బాగుతుందని మీనాను బాలు స్నేహితులు తెగ పొగడుతుతారు. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని అంటారు. స్నేహానికి పట్టిన చీడపరుగులు, నా పరువు తీస్తున్నారని బాలు అంటాడు. బాలు మాటల్ని వారు పట్టించుకోరు. స్నేహితుల వెన్నుపోటును సహించలేకపోతాడు బాలు.
బాలు ఈగో...
చేపల కూర తినాలని ఉన్నా ఈగో అడ్డు రావడంతో బాలు తిననని బెట్టు చేస్తాడు. తాను అక్కడే ఉంటే బాలు భోజనం చేయడని మీనా అర్థం చేసుకుంటుంది. బాలు కోసం మరో బాక్స్ పెట్టి వెళ్లిపోతుంది. బాలు మీనా వెళ్లిపోయింది కదా...ఇకనైనా భోజయం చేయమని బాలును స్నేహితులు అడుగుతారు. బాలు ఇక్కడ బెండవ్వడం బ్లెడ్‌లో లేదని చెబుతాడు.
కానీ చేపల కూర వాసన చూస్తూ నోరు కట్టేసుకోలేకపోతాడు. మీనా తన కోసం ఉంచిన బాక్స్ ఓపెన్ చేస్తాడు. అన్నం వృథా చేయద్దని నాన్న చెప్పిన మాట కోసమే భోజనం చేస్తున్నానని స్నేహితులతో అంటాడు. చేపల కూర గిన్నె మొత్తం ఖాళీ చేస్తాడు.
మనోజ్‌కు వార్నింగ్...
కామాక్షి చెప్పిన ఐడియాను ఎలా అమలు చేయాలా అని ఆలోచిస్తుంది ప్రభావతి. అప్పుడే మనోజ్ కనిపిస్తాడు. కామాక్షి దగ్గర తాను తెచ్చిన అప్పు అతడికి ఇస్తుంది. మీ ఆఫీస్‌లో బోనస్ ఇచ్చారని చెప్పి రోహిణికి ఇవ్వమని అంటుంది. ఏదో ఒక జాబ్ తొందరగా వెతుక్కోమని కొడుకుకు సలహా ఇస్తుంది. చిన్న ఉద్యోగాలు చేస్తూ తన స్థాయి తగ్గించుకోనని మనోజ్ అంటాడు.
రోహిణి వాళ్ల నాన్న చనిపోయిన తర్వాత అతడి ఆస్తులు, బిజినెస్‌లు నీకే దక్కుతాయని అప్పటివరకైనా ఏదో ఒక జాబ్ వెతుక్కోమని సీరియస్‌గా వార్నింగ్ ఇస్తుంది. తల్లి కోపం చూసి సరేనని మనోజ్ అంటాడు.
మీనాపై బాలు సెటైర్లు...
మీకు జ్యూస్ తీసుకొని రమ్మంటారా అని సత్యాన్ని అడుగుతుంది మీనా. ఈ ట్యాబ్లెట్స్ మింగేలా చేసింది చాల్లెదా అని బాలు కోపంగా మీనాతో అంటాడు. వదిన అడిగిన దానికి నువ్వు మాట్లాడిన దానికి ఏమైనా సంబంధం ఉందా అని మీనాకు మౌనిక సపోర్ట్ చేస్తుంది. మీ అన్నదమ్ములు కొట్టుకొని ఇంత దూరం తెచ్చానని నేను అనాలి...అన్నానా అని బాలుకు క్లాస్ ఇస్తాడు సత్యం.
మీనా తల్లికి అవమానం...
పండుగకు మీనా, బాలును తమ ఇంటికి పిలవడానికి మీనా తల్లి వస్తుంది. తల్లిని చూసి మీనా కంగారుపడుతుంది. తనకు చాలా పనులు ఉన్నాయని, పండుగకు రానని బాలు అంటాడు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వచ్చావంటూ మీనా తల్లిని ప్రభావతి అవమానిస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
టాపిక్