తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Love You Darling Audio Leak Viral In The Name Of Ex Minister Avanthi Srinivas

Audio Leak Viral : ఐ లవ్ యూ డార్లింగ్.. మాజీ మంత్రి పేరుతో ఆడియో వైరల్

HT Telugu Desk HT Telugu

13 November 2022, 21:16 IST

    • Audio Leaks In Andhra Pradesh : ఏపీ రాజకీయాల్లో ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరుతో గతంలో ఇలాంటి ఆడియోనే బయటకు వచ్చింది. తాజాగా మరో ఆడియో కూడా ఆయన పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీ రాజకీయాల్లో(AP Politics) ఆడియో టేపు(Audio Tapes)లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇవి ఎక్కువగా బయటకు వస్తున్నాయి. ఆ మధ్య ఓ మంత్రి పేరుతో ఆడియో బయటకు వచ్చింది. తాజాగా మరోసారి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్(Avanthi Srinivas Audio) పేరుతో ఆడియో బయటకు రావడం కలకలం రేపుతోంది. దీనిపై ఇంకా ఆయన స్పందించలేదు. ఈ ఆడియోపై స్పష్టతలేదు కానీ.. అవంతి శ్రీనివాస్ పేరుతో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

NEET UG Admit Card 2024 : నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య

ఈ ఆడియోలతో ఏపీ రాజకీయ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల వాయిస్, వారి పేర్లతో బయటకు వస్తున్నాయి. ఎవరైనా కావాలని చేయిస్తున్నారా? నిజమేనా అనేది క్లారిటీ లేకున్నా.. ప్రజాప్రతినిధుల పేర్లతో మాత్రం ఇవీ జనాల్లోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా అవంతి శ్రీనివాస్ పేరుతో 2 నిమిషాలకు పైగా ఉన్న.. ఆడియో వైరల్ గా మారింది. గతంలోనూ ఇలాంటి ఆడియో ఒకటి వైరల్(Audio Viral) అవ్వగా.. తనకూ ఆడియోకు ఎలాంటి సంబంధం లేదని అవంతి క్లారిటీ ఇచ్చారు.

తాజాగా బయటకు వచ్చిన ఆడియోలో లవ్ యూ బంగారం(Love You Bangaram).. ఎప్పుడూ నిద్రేనా అని ఆడియో వినిపిస్తూ ఉంది. మనం మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందని అడగగా 15 రోజులకుపైగానే అని మరోవైపు నుంచి సమాధానం వస్తుంది. ఇందులో భాగంగానే లవ్ యూ డార్లింగ్ అంటూ మరోసారి చెప్పే మాటలు వినిపిస్తాయి. ఈ ఆడియోను నెటిజన్లు సైతం షేర్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ ఆడియోను వైరల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వివిధ రకాల ట్విట్టర్ అకౌంట్ల నుంచి పోస్టులు పెడుతున్నారు.

గతంలో అవంతి పేరుతో ఆడియో లీక్(Audio Leak) వ్యవహారంపై టీడీపీ(TDP) నేత అయ్యన్నపాత్రుడు సీరియస్ గా స్పందించారు. విశాఖ(Visakha)ను రాజధానిగా ప్రకటించిన తర్వాత అవంతి గారి రాసలీలలు ఆడియో విడుదల తప్ప విశాఖ అభివృద్ధి అదనంగా ఒక్క రూపాయి అయినా ప్రభుత్వం విడుదల చేసిందా అని ట్వీట్ చేశారు. పదవి పోయాకా పరువు కాపాడుకునేందుకు ఉత్తరాంధ్ర(Uttaradhra) గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. అయితే తాజాగా బయటకు వచ్చిన ఆడియోపై ఇప్పటి వరకూ అవంతి శ్రీనివాస్ స్పందించలేదు. ఆడియో వ్యవహారంపై క్లారిటీ రావాల్సి ఉంది. కావాలనే ఎవరైనా క్రియేట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది.