తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కర్నూలులో 150 పడకలతో కామినేని ఆసుపత్రి

కర్నూలులో 150 పడకలతో కామినేని ఆసుపత్రి

HT Telugu Desk HT Telugu

18 January 2023, 12:54 IST

    • హైదరాబాద్‌, నార్కట్‌పల్లి, విజయవాడలో ఆసుపత్రులను నెలకొల్పిన కామినేని హాస్పిటల్స్ సంస్థ తాజాగా కర్నూలులో కూడా 150 పడకల ఆసుపత్రి ప్రారంభించింది.
కర్నూలు కామినేని హాస్పిటల్
కర్నూలు కామినేని హాస్పిటల్

కర్నూలు కామినేని హాస్పిటల్

వైద్య సేవల రంగంలో ఉన్న కామినేని హాస్పిటల్స్‌ తాజాగా కర్నూలులో నూతన ఆసుపత్రిని ప్రారంభించింది. జెమ్‌కేర్‌ కామినేని హాస్పిటల్స్‌ పేరుతో రూ. 150 కోట్లతో 150 పడకల సామర్థ్యంతో ఇది ఏర్పాటైంది.

ట్రెండింగ్ వార్తలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 150 ఉద్యోగాలు - నెలకు రూ. 70 వేల జీతం, అర్హతలివే

కాగా ఈ ఏడాదే రూ. 75 కోట్లతో 75 పడకల సామర్థ్యంతో క్యాన్సర్ చికిత్స కేంద్రం సైతం స్థాపించనున్నారు. మెరుగైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో వైద్య సేవలను ఈ కేంద్రం తదుపరి స్థాయికి మారుస్తుందని సంస్థ తెలిపింది. అందుబాటు ధరలో ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించడం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పినట్టు కామినేని హాస్పిటల్స్‌ గ్రూప్ వివరించింది.

కార్డియాక్‌, న్యూరో, అనస్తీషియా, క్రిటికల్‌ కేర్‌, జనరల్‌ మెడిసిన్‌, మెడికల్‌, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఈఎన్‌టీ, జనరల్‌, మినిమల్‌ యాక్సెస్‌ సర్జరీ, ప్లాస్టిక్‌/కాస్మెటిక్‌ సర్జరీ, రెనల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, యూరాలజీ, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీస్‌, డయాబెటాలజీ, ఎండోక్రినాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ, రుమటాలజీ వంటి విభాగాల్లో నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.

పారదర్శకత, ప్రతిస్పందన, నైతికత అనే మూడు స్తంభాలకు కట్టుబడి కామినేని హాస్పిటల్స్ ఆరోగ్య సంరక్షణ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సమాజ అవసరాలకు అవిశ్రాంతంగా పనిచేస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నాణ్యమైన వైద్య సేవలతో కోట్లాది మందికి చేరువైన కామినేని హాస్పిటల్స్‌ మొత్తం 3,000లకుపైగా పడకలతో హైదరాబాద్‌, నార్కట్‌పల్లి, విజయవాడలో ఆసుపత్రులను నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్‌, డెంటల్‌ కళాశాలలు ఉన్నాయి.