తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Jansena Pawan Kalyan Wishes On Womens Day And Expresses His Desire 33percent Quota For Women

PawanKalyan Womensday: మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే-పవన్ కళ్యాణ్

HT Telugu Desk HT Telugu

08 March 2023, 9:59 IST

    • PawanKalyan Womensday మహిళాదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనన్నారు. 
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

PawanKalyan Womensday మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందేనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్శ క్తి స్వరూపిణి స్త్రీ.. బహుకృత రూపిణి స్త్రీ.. బహుముఖ ప్రజ్ఞాశాలి స్త్రీ.. మానవ సృష్టికి మూలకారిణి స్త్రీ.. ఇంతటి మహోన్నతమైన స్త్రీకి మనం ఏమిస్తే రుణం తీరుతుందన్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP EMRS Inter Admissions : ఏపీ ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు-మే 3 నుంచి దరఖాస్తులు ప్రారంభం

AP Govt Salaries: ఎలక్షన్ ఎఫెక్ట్‌... ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, సర్వీస్ పెన్షన్లు... ఐదేళ్లలో ఇదే రికార్డ్

Papikondalu Tour Package : గోదావరిలో పాపికొండల మధ్య బోటు ప్రయాణం- రాజమండ్రి నుంచి ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

AP Inter Supplementary: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్, నేడు కూడా సప్లిమెంటరీ ఫీజు కట్టొచ్చు…

తల్లిగా.. తోబుట్టువుగా.. భార్యగా.. బిడ్డగా.. భిన్నరూపాలలో మన మధ్య ఉన్న స్త్రీమూర్తి సేవలు వెల కట్టలేనివని, మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిదన్నారు. ఇంతటి మహత్తరమైన వనితా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మనం చెప్పుకొంటుంటామని,అదే సత్యమన్నారు. స్త్రీలను గౌరవించే చోట శాంతి సౌభాగ్యాలు విలసిల్లతాయని ధృడంగా విశ్వసిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. స్త్రీ సంపూర్ణ సాధికారిత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి మన సమాజం, ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు.

మహిళలపై అఘాయిత్యాలు జరగని సమాజం ఆవిష్కృతం కావడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని, స్త్రీ ఆర్థిక స్వావలంబనతో స్వశక్తిపై నిలబడలన్నా, సాధికారిత సాధించాలన్నా చట్ట సభలలో వారి సంఖ్యా బలం పెరగవలసి ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతానన్నారు.

చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని జనసేన డిమాండ్ చేయడంతో పాటు ఈ అంశాన్ని పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన విషయం ఆడపడుచులు అందరికీ విదితమేనన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ల దిశగా రాజకీయ ప్రయత్నం చిత్తశుద్ధితో కొనసాగుతుందని మీకు సవినయంగా విన్నవిస్తున్నానని మహిళామణులందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.

టాపిక్