తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Janasena : వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర నిర్వీర్యం….. నాదెండ్ల మనోహర్

Janasena : వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర నిర్వీర్యం….. నాదెండ్ల మనోహర్

HT Telugu Desk HT Telugu

25 November 2022, 18:51 IST

    • Janasena  రాష్ట్రంలో  ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూచూడలేదని జనసేన పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తోందని,  ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిగా గాలిలో కలిసి పోయిందన్నారు.  గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ స్వచ్ఛమైన తాగు నీరు లేదని,  గిరిజనుల సమస్యలు పరిష్కరించాలనే మనసు  పాలకులకు లేదన్నారు.  కురుపాం నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ వ్యవహార శైలిపై విమర్శలు గుప్పించారు. 
జనసేన పిఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
జనసేన పిఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

జనసేన పిఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

Janasena ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టేసి, అడిగిన వారిపై కేసులు నమోదు చేసే దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూచూడలేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని నియోజకవర్గాల సమీక్షలో భాగంగా శుక్రవారం ఉదయం కురుపాం నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మనోహర్ పాల్గొన్నారు. నియోజకవర్గం లోని సమస్యలు పార్టీ బలోపేతం మీద జనసైనికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP Medical Colleges: ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్స్‌, ట్యూటర్‌ పోస్టులు

Bheemili Beach : మనసు దోచేస్తున్న భీమిలి బీచ్- విశాఖలోని టూరిస్ట్ ప్రదేశాలివే!

AP Weather Update: కోస్తాలో వర్షాలు, రాయలసీమలో భగభగలు, ఏపీలో నేడు, రేపు కూడా వర్షాలు

AP Rains Alert: ఏపీలో చల్లబడిన వాతావరణం, పలు జిల్లాల్లో భారీ వర్షం- పిడుగుపాటు హెచ్చరికలు జారీ

"ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యుత్తమంగా గతంలో తీర్చిదిద్దారని, ఎస్సీ వర్గాలతోపాటు గిరిజన ప్రాంతాల్లోని ఎస్టీలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత ఉందన్నారు. ఇప్పటి ప్రభుత్వం ఆ సబ్ ప్లాన్ ని కూడా అమలు చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉందని విమర్శించారు. కనీస నిధులు వెచ్చించలేకుండా, గిరిజన ప్రాంతాలను పట్టించుకోకుండా పాలిస్తున్నారని, ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో సరైన తాగునీటి సదుపాయం లేదని, గిరిజన గ్రామాల్లో మైనింగ్ మీద, తవ్వకాలు మీద పెట్టిన దృష్టి అక్కడ సంక్షేమం మీద ప్రభుత్వాలు పెట్టడం లేదని ఆరోపించారు. గిరిజనులకు ఒక దారి చూపించాల్సిన బాధ్యతను తీసుకోవడం లేదన్నారు. గిరిజన ప్రాంతాల సమస్యల పరిష్కారం మీద జనసేన పార్టీ చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని ప్రకటించారు.

సాగు నీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి

ఉత్తరాంధ్రపై వైసీపీ నేతల కపట ప్రేమ ప్రజలు గమనిస్తున్నారని, ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా సమీక్షలో భాగంగా చాలామంది చెప్పిన విషయాలు తాగు, సాగు నీరు గురించే ఎక్కువ ఉన్నాయని, ఉత్తరాంధ్రలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం అసలు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కనీస నిధులు వాటికి వెచ్చించలేదని, ఫలితంగా మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు ఎండిపోతోందన్నారు.

జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తరాంధ్ర ప్రాంతంలోని సాగు, తాగు నీటి సమస్యను పూర్తిగా పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని ప్రకటించారు. ఈ ప్రాంతంలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడంపై పూర్తి స్థాయి దృష్టిపెడతామన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో నీటి సమస్య ఎక్కడ కనిపించకుండా చూసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇక్కడి ప్రజలను మోసం చేయడం కాకుండా వీరికి సాయం చేసే విధంగా జనసేన ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

టాపిక్