తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Isro's Pslv-c54: పీఎస్‌ఎల్వీ సీ - 54 ప్రయోగం సక్సెస్

ISRO's PSLV-C54: పీఎస్‌ఎల్వీ సీ - 54 ప్రయోగం సక్సెస్

HT Telugu Desk HT Telugu

26 November 2022, 14:36 IST

  •  Indian Space Research Organisation PSLV-C54: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (PSLV)-C54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ-54 రాకెట్‌ ద్వారా 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు.

 నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ- సి 54 రాకెట్
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ- సి 54 రాకెట్ (isro)

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ- సి 54 రాకెట్

ISRO successfully launch PSLV-C54: ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ సీ 54 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట ద్వారా ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ-54 రాకెట్‌ ద్వారా 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు.ఈవోఎస్‌ శాట్‌-6 సహా 8 నానో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-54 నిర్దేశిత కక్ష్యలోకి మోసుకెళ్లింది.

ఈ ప్రయోగంలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల ద్వారా భూవాతావరణం పరిశీలన, తుపానులను పసిగట్టడం, సముద్రాల మీద వాతావరణంపై అధ్యయనం చేయనున్నారు. ఇందులో భాగంగా భారత్‌కు చెందిన 1,117 కేజీల బరువున్న ఈఓఎస్‌ 06, అలాగే 18.28 కేజీల బరువున్న ఐఎన్‌ఎస్‌ 2బీ, 16.15 కిలోల బరువున్న ఆనంద్‌, 1.45 కిలోల బరువున్న రెండు థాయ్‌ బోల్ట్‌ షాటిలైట్స్‌తో పాటు.. 17.92 కేజీల బరువున్న 4 యూఎస్‌కు చెందిన యాస్ట్రో కాట్‌ ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. తాజాగా మరో ప్రయోగం విజయవంతం కావడంపై ఇప్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ.. ఓషన్ శాట్ ఉపగ్రహాన్ని, పీఎస్ఎల్వీ సీ-54 రాకెట్‌ను విజయవంతంగా ప్రవేశ పెట్టిందని వెల్లడించారు. సోలార్ ప్యానెల్స్ ఓపెన్ అయ్యాయని.... నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహం చేరిందని ప్రకటించారు. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితమే ఈ విజయమని చెప్పారు.

ISRO launched India's first ‘private rocket: ఇదే నెలలో దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించింది ఇస్రో. ప్రైవేట్ సంస్థ అభివృద్ది చేసిన రాకెట్ విక్రమ్ - Sను.. విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రైవేటు సంస్థ.. ఈ రాకెట్ ను రూపొదించింది. దీనికి విక్రమ్‌-సబార్బిటల్‌ (వీకేఎస్‌)గా పేరు పెట్టారు. ఈ మొట్టమొదటి మిషన్‌కు ‘ప్రారంభ్‌’ అని నామకరణం చేశారు. ఇలా ప్రైవేట్ రంగంలో రాకెట్ ను అభివృద్ధి చేయడం ఇదే మెుదటిసారి. విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ మూడు పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. విద్యార్థులు తయారు చేసిన 2.5 కిలోల పేలోడ్‌ సైతం తీసుకెళ్లింది. స్పేస్‌ కిడ్స్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇది తయారైంది. అంతరిక్ష(Space) సాంకేతికరంగ నూతన సంస్థలకు ప్రోత్సాహం, నియంత్రణలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇన్‌-స్పేస్‌(In-Space) సంస్థ నోడల్‌ ఏజెన్సీగా వర్క్ చేస్తోంది. విక్రమ్‌ -ఎస్‌ రాకెట్‌ 6 మీటర్ల పొడవు, 545 కిలోల బరువు ఉంది. ఈ రాకెట్ ద్వారా 3 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపారు. వీటిలో ఒకటి చెన్నైలోని ఏరోస్పేస్‌ స్టార్టప్‌ స్పేస్‌కిడ్స్‌ తయారుచేసిన 2.5 కేజీల శాటిలైట్ ఫన్‌-శాట్‌ కాగా.. మిగతా రెండూ విదేశీ శాటిలైట్లు ఉన్నాయి.