తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Shirdi Tour: విజయవాడ నుంచి షిర్డీ టూర్ - తాజా Irctc ప్యాకేజీ ఇదే…

IRCTC Shirdi Tour: విజయవాడ నుంచి షిర్డీ టూర్ - తాజా IRCTC ప్యాకేజీ ఇదే…

HT Telugu Desk HT Telugu

22 October 2022, 20:39 IST

    • IRCTC Shirdi Tour: విజయవాడ నుంచి షిరిడీకి తాజా టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొంది.
విజయవాడ షిర్డీ టూర్,
విజయవాడ షిర్డీ టూర్, (www.irctctourism.com)

విజయవాడ షిర్డీ టూర్,

IRCTC Shirdi Tour From Vijayawada: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా షిరిడీ సాయిబాబా భక్తుల కోసం గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నుంచి షిర్డీకి వెళ్లేందుకు రైల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'SAI SANNIDHI EX - VIJAYAWADA' పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

PV Ramesh On Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు నేను బాధితుడినే అన్న పీవీ రమేష్, పేర్నినాని కౌంటర్

AP Weather Update: పగలంతా మండే ఎండలు, ఉక్కపోత… సాయంత్రానికి చల్లబడిన వాతావరణం ద్రోణీ ప్రభావంతో ఏపీలో వర్ష సూచన

AP IIIT Admissions : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, మే 8 నుంచి అప్లికేషన్లు షురూ

RTE Admissions: ఏపీలో 25125 మంది బాలలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు

3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. ప్రతీ మంగళవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ నవంబర్ 1వ తేదీన అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీలో సాయిబాబా దర్శనంతో పాటు శనిశిగ్నాపూర్ కూడా కవర్ అవుతుంది.

Day - 1: మొదటి రోజు విజయవాడలో స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. రాత్రంతా జర్నీ ఉంటుంది.

Day - 2: రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి బయల్దేరుతారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత షిరిడీ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రికి షిరిడీలో బస చేయాల్సి ఉంటుంది.

Day - 3 : ఇక 3వ రోజు ఉదయం శనిశిగ్నాపూర్ సందర్శన ఉంటుంది. అక్కడ్నుంచి మళ్లీ షిరిడీ చేరుకోవాలి. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

Day 04 Friday: తెల్లవారుజామున 2.50 విజయవాడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ధరల వివరాలు....

కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 15, 790 ధర ఉండగా... డబుల్ ఆక్యుపెన్సీకి రూ.9910, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8230 చెల్లించాలి. ఐదు నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. కింది జాబితాలో వివరాలను చెక్ చేసుకోవచ్చు.

ధరల వివరాలు

NOTE

ఈ టూర్ ను బుకింగ్ చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేసుకోవచ్చు.