IRCTC Araku Tour Package Details : అరకు అందాలను చూడాలని చాలా మంది అనుకుంటారు. కొండల్లో కోనల్లో గడపాలనుకుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ VISAKHAPATNAM - ARAKU RAIL CUM ROAD PACKAGE ప్రకటించింది. ఒక్క రోజు వ్యవధిలోనే టూర్ ఉంటుంది. అయితే రైలులో అరకులో ప్రయాణం చేయవచ్చు. అక్టోబర్ 21న ఈ టూర్ అందుబాటులో ఉంది.
ఉదయం విశాఖపట్నం(visakhapatnam) రైల్వే స్టేషన్ నుంచి టూర్ మెుదలవుతుంది. ఈ రైలు అరకు వ్యాలీకు వెళ్తుంది. టన్నెల్స్, బ్రిడ్జిలపై నుంచి వెళ్తున్న సమయంలో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతారు. అరకు(Araku) అందాలను చూడొచ్చు. ప్రకృతిలో ప్రయాణం ఉంటుంది.
అరకు వ్యాలీ(Araku Valley)కి చేరుకున్న తర్వాత బస్సులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ట్రైబల్ మ్యూజియంతో పాటు గార్డెన్స్(Tribal Museum and Gardens)ను సందర్శిస్తారు. లంచ్ తర్వాత తిరిగి వైజాగ్(Vizag)కు బయల్దేరుతారు. వచ్చే క్రమంలో అనంతగిరి కాఫీ ప్లాన్ టేషన్, గాలికొండ వ్యూ పాయింట్ కు తీసుకెళ్తారు. అనంతరం విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో ఒక్కరోజు టూర్ కంప్లీట్ అవుతుంది.
ఈ ఒక్క రోజు ప్యాకేజీకి వచ్చే రూ.3060 నుంచి రూ.1815 లోపు ధరలు ఉంటాయి. చిన్నారులు, పెద్దలకు వేర్వురుగా ధరలు నిర్ణయించారు. వెళ్లే కోచ్ ను బట్టి కూడా ధరలు మారుతాయి. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ వెళ్లొచ్చు.