తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Tirumala Tour Package : తిరుమల సహా ఐదు దేవాలయాల సందర్శన, ఐఆర్సీటీసీ రెండ్రోజుల టూర్ ప్యాకేజీ ఇదే!

IRCTC Tirumala Tour Package : తిరుమల సహా ఐదు దేవాలయాల సందర్శన, ఐఆర్సీటీసీ రెండ్రోజుల టూర్ ప్యాకేజీ ఇదే!

27 June 2024, 14:05 IST

google News
    • IRCTC Tirumala Tour Package : తిరుమల సహా ఐదు ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. రెండు రోజుల్లో రోడ్డు మార్గంలో ఈ దేవాలయాలను దర్శించుకోవచ్చు.
తిరుమల సహా ఐదు దేవాలయాల సందర్శన, ఐఆర్సీటీసీ రెండ్రోజుల టూర్ ప్యాకేజీ ఇదే!
తిరుమల సహా ఐదు దేవాలయాల సందర్శన, ఐఆర్సీటీసీ రెండ్రోజుల టూర్ ప్యాకేజీ ఇదే!

తిరుమల సహా ఐదు దేవాలయాల సందర్శన, ఐఆర్సీటీసీ రెండ్రోజుల టూర్ ప్యాకేజీ ఇదే!

IRCTC Tirumala Tour Package : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల. తూర్పు కనుమలలోని ఏడు కొండలలోని తిరుమల కొండపై ఉన్న శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకోవడానికి నిత్యం లక్షల్లో భక్తులు వస్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం దేశనలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. తిరుపతి చేరుకున్న భక్తులకు తిరుమల సహా చుట్టుపక్కల దేవాలయాల సందర్శనకు ఐఆర్సీటీసీ పంచ్ దేవాలయం టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో రెండు రోజుల్లో కాణిపాకం, తిరుచానూరు, తిరుమల, తిరుపతి దేవాలయాలను సందర్శించవచ్చు. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ. 6590. రోడ్డు మార్గంలో ఈ టూర్ అందిస్తున్నారు.

ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్ :

క్లాస్ సింగిల్ షేరింగ్డబుల్ షేరింగ్ట్రిపుల్ షేరింగ్చైల్డ్ విత్ బెడ్(5-11 సంవత్సరాలు)చైల్డ్ వితవుట్ బెడ్(5-11 సంవత్సరాలు)
కంఫర్ట్రూ.8280రూ.6880రూ.6590రూ.4570రూ.4070

  • పర్యటన ఇలా : తిరుపతి - తిరుమల - శ్రీ కాళహస్తి - కాణిపాకం (1 రాత్రి / 2 రోజులు)

1వ రోజు :

తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య రిపోర్ట్ చేయాలి. రైల్వే స్టేషన్ లో పర్యాటకులను పికప్ చేసుకుని, హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో ఫ్రెష్ అయ్యాక సొంత ఖర్చులతో అల్పాహారం చేస్తారు. అనంతరం శ్రీనివాస మంగాపురం, కాణిపాకం దేవాలయాల సందర్శనకు వెళ్తారు. మార్గంలో మధ్యాహ్న భోజనం చేస్తారు. తర్వాత శ్రీ కాళహస్తి ఆలయాన్ని సందర్శించి తిరిగి హోటల్‌కి చేరుకుంటారు. రాత్రికి తిరుపతిలో బస చేస్తారు.

2వ రోజు :

హోటల్‌లో అల్పాహారం చేస్తారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం బయలుదేరతారు. ఉదయం 9 గంటలకు తిరుమల కొండకు బయలుదేరతారు. శ్రీవారి దర్శనం అనంతరం తిరుచానూరు పద్మావతి ఆలయాన్ని సందర్శించారు. తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు.

పర్యాటకులు అందరూ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. ప్యాకేజీని బుక్ చేస్తున్నప్పుడు గుర్తింపు కార్డు సమర్పించాలి. గుర్తింపు కార్డు లేకపోతే టీటీడీ దర్శనానికి అనుమతించదు. పర్యాటకులు తలనీలాల సమర్పణకు కొంత సమయం కేటాయిస్తారు. అయితే అధిక రద్దీ విషయంలో స్థానిక టూర్ గైడ్ సూచనలను పాటించాలి. తిరుమలలో తప్పనిసరి డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి. జెంట్స్ అయితే ధోతీ (తెలుపు), చొక్కా లేదా కుర్తా పైజామా ధరించాలి. స్త్రీలు చీర లేదా సల్వార్ కమీజ్ (పల్లుతో తప్పనిసరి) ధరించాలి. టీ-షర్ట్, జీన్స్ వంటి దుస్తులను ధరించకూడదు. ఏ వయస్సుతో సంబంధం లేకుండా డ్రెస్ కోడ్ కచ్చితంగా పాటించాలి.

ఈ ప్యాకేజీలో తిరుపతిలో ఏసీ వసతి కల్పిస్తారు. అలాగే రోడ్డు మార్గంలో ప్రయాణం కోసం ఏసీ వాహనం అందుబాటులో ఉంటుంది. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూరులో సాధారణ దర్శనం కల్పిస్తారు.

  • టూర్ ఫ్రీక్వెన్సీ : ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం
  • అందుబాటులో ఉన్న సీట్లు: 10

ఐఆర్సీటీసీ పంచ్ దేవాలయం టూర్ ప్యాకేజీ బుకింగ్, పూర్తి వివరాలకు కింద లింక్ పై క్లిక్ చేయండి.

తదుపరి వ్యాసం