తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Private Rocket Vikram - S : నింగిలోకి తొలి ప్రైవేట్‌ రాకెట్‌.. ప్రయోగం సక్సెస్

Private Rocket Vikram - S : నింగిలోకి తొలి ప్రైవేట్‌ రాకెట్‌.. ప్రయోగం సక్సెస్

HT Telugu Desk HT Telugu

18 November 2022, 11:56 IST

  •  Vikram S Rocket Launched: దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించింది ఇస్రో. ప్రైవేట్ సంస్థ అభివృద్ది చేసిన రాకెట్ విక్రమ్ - Sను.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 

తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం సక్సెస్
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం సక్సెస్ (ANI)

తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం సక్సెస్

ISRO launched India's first ‘private rocket: ఇస్రో చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు శ్రీహరికోటలోని షార్‌లోని సౌండింగ్‌ రాకెట్‌ కాంప్లెక్స్‌ నుంచి తొలి ప్రైవేటు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 150 ఉద్యోగాలు - నెలకు రూ. 70 వేల జీతం, అర్హతలివే

హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రైవేటు సంస్థ.. ఈ రాకెట్ ను రూపొదించింది. దీనికి విక్రమ్‌-సబార్బిటల్‌ (వీకేఎస్‌)గా పేరు పెట్టారు. ఈ మొట్టమొదటి మిషన్‌కు ‘ప్రారంభ్‌’ అని నామకరణం చేశారు.

ఇలా ప్రైవేట్ రంగంలో రాకెట్ ను అభివృద్ధి చేయడం ఇదే మెుదటిసారి. విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ మూడు పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. విద్యార్థులు తయారు చేసిన 2.5 కిలోల పేలోడ్‌ సైతం తీసుకెళ్లింది. స్పేస్‌ కిడ్స్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇది తయారైంది. అంతరిక్ష(Space) సాంకేతికరంగ నూతన సంస్థలకు ప్రోత్సాహం, నియంత్రణలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇన్‌-స్పేస్‌(In-Space) సంస్థ నోడల్‌ ఏజెన్సీగా వర్క్ చేస్తోంది. విక్రమ్‌ -ఎస్‌ రాకెట్‌ 6 మీటర్ల పొడవు, 545 కిలోల బరువు ఉంది. ఈ రాకెట్ ద్వారా 3 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపారు. వీటిలో ఒకటి చెన్నైలోని ఏరోస్పేస్‌ స్టార్టప్‌ స్పేస్‌కిడ్స్‌ తయారుచేసిన 2.5 కేజీల శాటిలైట్ ఫన్‌-శాట్‌ కాగా.. మిగతా రెండూ విదేశీ శాటిలైట్లు ఉన్నాయి.

ప్రయోగం విజయవంతం కావటంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు స్కైరూట్ సంస్థ కూడా హర్షం వ్యక్తం చేసింది. ఇస్రో ఇప్పటికే విదేశీ శాటిలైట్లను నింగిలోకి పంపడం ద్వారా భారీగా ఆదాయం పొందుతున్న సంగతి తెలిసిందే. దీన్ని మరింత విస్తరించే క్రమంలో ప్రైవేట్ రాకెట్లను కూడా ప్రయోగించేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా తొలి రాకెట్ ప్రయోగం సక్సెస్ కావటంతో… ఇస్రో మరిన్ని రాకెట్లను ప్రయోగించే అవకాశం ఉంది.

టాపిక్