తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Heavy Rains Damage Crops In Andhra Pradesh

Crop Damage : భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు

HT Telugu Desk HT Telugu

19 March 2023, 15:06 IST

    • Crop Damage : భారీ వర్షాలతో రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనజీవనానికి అంతరాయం కలుగుతుంది.
వర్షాలతో దెబ్బతిన్న పంట
వర్షాలతో దెబ్బతిన్న పంట

వర్షాలతో దెబ్బతిన్న పంట

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం కురిసిన భారీ వర్షాలకు వరి, పొగాకు, మొక్కజొన్న, మామిడి, జీడి తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి గ్రామానికి చెందిన మెట్ల సంధ్య(36) అనే మహిళ ఈదురు గాలులతో భారీ వృక్షం మీద పడి మృతి చెందింది. ఆమెకు భర్త, కూతురు, కుమారుడు ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

NEET UG Admit Card 2024 : నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య

రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, తుని, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలూరు జిల్లాలో మొక్కజొన్న పంటలు కోసి నేలమీద వేశారు. అయితే అకాల వర్షాలు పంటను దెబ్బతీశాయి. తమ పంటలకు టార్పాలిన్లు లేవని రైతులు తెలిపారు. ఎదుగుదల దశలో ఉన్న మామిడి, జీడి పంటలు కూడా దెబ్బతిన్నాయి.

నూజివీడు మండలం బోరవంచ గ్రామాన్ని సందర్శించిన ఏలూరు జిల్లా ఉద్యానశాఖ అధికారి పీవీఎస్ రవికుమార్ మాట్లాడుతూ వర్షం కారణంగా మామిడి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఈ పంటలను కాపాడుకునేందుకు శాస్త్రవేత్తల సూచన మేరకు రైతులు పురుగుమందులు పిచికారీ చేయాలని సూచించారు.

తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ అధికారి ఎం.మాధవరావు మాట్లాడుతూ ప్రస్తుతం వరి పంట కోత దశలో ఉందన్నారు. రైతులు తమ పంటలను సురక్షిత ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. ఎంటీయూ 1121 రకం వరి కోతకు ఇంకా సమయం ఉందని ఆయన సూచించారు.

పొగాకు, మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏలూరు జిల్లాలోని ఐదు మండలాల్లో వర్జీనియా పొగాకు సాగు చేశారు. వర్షం కారణంగా పొగాకు గ్రేడ్‌ పడిపోవడంతో నష్టపోతామని రైతులు వాపోతున్నారు. మిర్చి రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు.. అకాల వర్షాలపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. వానలతో జరిగిన పంట నష్టంపై ఎన్యుమరేషన్ ప్రారంభించాలన్నారు. వారంలోగా.. దీనికి సంబంధించి నివేదికలు ఇవ్వాలన్నారు. దీని ఆధారంగా రైతులకు సహాయపడేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

టాపిక్