తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Floods In Krishna River : భారీ వర్షాలు.. జలాశయాల నుంచి నీటి విడుదల

Floods In Krishna River : భారీ వర్షాలు.. జలాశయాల నుంచి నీటి విడుదల

HT Telugu Desk HT Telugu

11 September 2022, 21:12 IST

google News
    • Srisailam Gates Lifted : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో ప్రధాన జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.
ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల
ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల

ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని రిజర్వాయర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నీరు భారీగా వస్తుండటంతో ప్రధాన జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇదిలా ఉండగా ప్రకాశం బ్యారేజీకి వరద కొనసాగుతుండటంతో అధికారులు బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. 4,12,769 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో నమోదవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,32,723 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,35,786 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. మొత్తం 885 అడుగులకు గాను ప్రాజెక్టు నీటిమట్టం 884.20 అడుగులకు చేరుకుంది. మొత్తం నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గానూ.. 210.9946 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కర్నూలు జిల్లాలోని తుంగభద్ర జలాశయం 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 38,567 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 32,402 క్యూసెక్కులుగా నమోదవుతోంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులుగా ఉంది. మొత్తం 105.788 టీఎంసీలకు గాను 104.383 టీఎంసీల నీరు నిండి ప్రస్తుతం 1632.65 అడుగులకు చేరుకుంది.

తదుపరి వ్యాసం