Srisailam: 2 రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే ఛాన్స్...! -srisailam gets constant inflows from almatti and gates likely to be lift in 2 days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Srisailam: 2 రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే ఛాన్స్...!

Srisailam: 2 రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే ఛాన్స్...!

HT Telugu Desk HT Telugu
Jul 21, 2022 09:54 AM IST

srisailam project: శనివారం నాటికి శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. భారీగా వరద తరలిరావటంతో… గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

శ్రీశైలంలోకి కొనసాగుతున్న ప్రవాహం
శ్రీశైలంలోకి కొనసాగుతున్న ప్రవాహం

water level in srisailam dam:కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్ట్ ల్లోకి వరద నీరు కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి నీటి ప్రవాహం శ్రీశైలానికి తరలివస్తోంది. ఇన్‌ఫ్లో 2,22,935 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 879 అడుగులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటినిల్వ సామర్థ్యం182.9910 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. ఇక ఇదే రీతిలో వరద ప్రవాహం కొనసాగితే శనివారం నాటికి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉండటంతో.. గేట్లు కూడా ఎత్తే ఛాన్స్ ఉంది.

ఇక జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ముందస్తుగా అధికారులు ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్‌ఫ్లో 94,000 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,16,533 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318 అడుగులుగా కాగా, ప్రస్తుతం 317 అడుగులుగా కొనసాగుతుంది. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్ట్‌కు కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్ట్ లోకి చేరుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 28 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర ఇన్‌ఫ్లో 1,32,277 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 93,423 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. తుంగభద్ర ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1631 అడుగులుగా ఉంది.

ఇక నాగార్జున సాగర్ లో ప్రస్తుతానికి 534.1 అడుగుల మేర నీటిమట్టం ఉంది. మొత్తం ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా.. గురువారం ఉదయం సమయానికి 176.23 టీఎంసీల మేరకు నీరు ఉంది. శ్రీశైలం నిండి గేట్లు ఎత్తితే.. సాగర్ కు భారీ స్థాయిలో వరద నీరు వచ్చే అవకాశం ఉంది.

IPL_Entry_Point