తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Graduate Mlc Election : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు ప్రారంభం

Graduate MLC Election : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు ప్రారంభం

HT Telugu Desk HT Telugu

24 September 2022, 11:22 IST

    • Graduate MLC Election ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఓటర్ల నమోదుకు యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. 2019 నాటికి పట్టభద్రులైన వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు సన్నాహాలు చేస్తోంది. 
ఓటర్ల నమోదుకు ఏర్పాట్లు
ఓటర్ల నమోదుకు ఏర్పాట్లు

ఓటర్ల నమోదుకు ఏర్పాట్లు

Graduate MLC Election నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియ కోసం జిల్లాల యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరిసీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల పరిధిలోని తహసీల్దార్లు, ఆర్డీఓలు, జోనల్‌ కమిషనర్‌ కార్యాలయాల్లో ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

AB Venkateswararao : ఏపీ సర్కార్ కు షాక్, ఏబీవీ సస్పెన్షన్ కొట్టివేత-విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఆదేశాలు

AP PGECET 2024 : ఏపీ పీజీఈసెట్ కరెక్షన్ విండో ఓపెన్, మే 14 వరకు దరఖాస్తు సవరణలకు అవకాశం

AP Medical Colleges: ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్స్‌, ట్యూటర్‌ పోస్టులు

Bheemili Beach : మనసు దోచేస్తున్న భీమిలి బీచ్- విశాఖలోని టూరిస్ట్ ప్రదేశాలివే!

Graduate MLC Election పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుంచి 2017లో ఎన్నికైన పీవీఎన్‌ మాధవ్‌ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి నెలతో ముగియనున్నది. ఈ లోపు ఎమ్మెల్సీ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనుంది. ఎన్నికకు సన్నాహకంగా ఓటరు జాబితాల తయారీ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో అభ్యర్ధులను బరిలో దింపేందుకు ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

Graduate MLC Election ఓటరు నమోదు కార్యక్రమాన్ని వచ్చే నెల 1న ప్రారంభించనున్నారు. ఓటర్ల జాబితాలో కొత్త వారిని చేర్చేందుకు జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నది. ఈ ఎన్నికకు జిల్లా కలెక్టర్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. మిగిలిన జిల్లాల డీఆర్వోలు అదనపు రిటర్నింగ్‌ అధికారులుగా కొనసాగుతారు.

ఓటర్ల నమోదు జరుగనుందిలా…

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని అక్టోబర్ 1 నుంచి ప్రారంభిస్తారు. వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అక్టోబరు 1 నుంచి నవంబరు 7వరకు ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

నవంబరు 23న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. డిసెంబరు 9వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరిస్తారు. డిసెంబరు 30న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.

మండలాల వారీ ఓటరు నమోదు దరఖాస్తులు పంపనున్నారు. 2017లో జరిగిన Graduate MLC Election ఎన్నికల్లో 1.70 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ సారి రాజకీయ పార్టీలు ఆరు నెలల ముందు నుంచే ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టి సారించాయి. అధికార పార్టీ తమ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్‌ ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రకటించింది. తెదేపా త్వరలో తమ అభ్యర్థిని ప్రకటించనున్నది. భాజపా తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్సీ మాధవ్‌ మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వామపక్ష పార్టీలు తమ అభ్యర్థిని Graduate MLC Electionలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

ఓటు నమోదుకు అర్హతలు…

త్వరలో జరిగే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికకు 2019 అక్టోబరు నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 10వ తరగతి అనంతరం దూరవిద్య ద్వారా డిగ్రీ చదివిన వారు ఓటు హక్కు పొందడానికి అనర్హులుగా ప్రకటించారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత మూడేళ్ల డిప్లమో కోర్సు చేసినా అనర్హులేనని అధికారులు ప్రకటించారు. పది తర్వాత, ఇంటర్‌, తర్వాత మూడేళ్ల డిగ్రీ చేసిన వారు రెగ్యులర్‌ విద్యా విధానంలో చదివి ఉండాలి. ఓటరు నమోదు దరఖాస్తుతో పాటు డిగ్రీ ధ్రువపత్రం, ఆధార్‌ కార్డు నకళ్లు సమర్పించాలి. వాటిని గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరించాలి. దరఖాస్తుపై కలర్‌ పాస్‌పోర్టు సైజు ఫొటో అతికించాల్స ఉంటుంది.