తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd News : పెద్దశేష వాహనంపై శ్రీ వైకుంఠ నారాయణుడి అలంకారంలో సిరులతల్లి

TTD News : పెద్దశేష వాహనంపై శ్రీ వైకుంఠ నారాయణుడి అలంకారంలో సిరులతల్లి

HT Telugu Desk HT Telugu

21 November 2022, 14:05 IST

    • TTD News తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన సోమవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై శ్రీ వైకుంఠ నారాయణుడి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
వైకుంఠ నారాయణుడి అలంకారంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారు
వైకుంఠ నారాయణుడి అలంకారంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారు

వైకుంఠ నారాయణుడి అలంకారంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారు

TTD News తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన సోమవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై శ్రీ వైకుంఠ నారాయణుడి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP Rains Alert: ఏపీలో చల్లబడిన వాతావరణం, పలు జిల్లాల్లో భారీ వర్షం- పిడుగుపాటు హెచ్చరికలు జారీ

AP RGUKT Admissions 2024 : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు, మే 8 నుంచి జూన్ 25 వరకు అప్లికేషన్లు స్వీకరణ

AP ECET 2024: రేపీ ఏపీ ఈసెట్‌ 2024, ఇప్పటికే హాల్‌ టిక్కెట్ల విడుదల చేసిన JNTU కాకినాడ

AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ 2024 సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేసిన జేఎన్‌టియూ కాకినాడ

శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది. నేటి రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.

పెద్ద శేష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన సోమవారం ఉదయం పెద్ద శేష వాహనసేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను టిటిడి జెఈవో ఆవిష్కరించారు.

వీటిలో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రాల్లో అత్యంత ప్రామాణిక‌మైన 'ఉత్సవ సార సంగ్రహము -1మరియు 2 ', ' సహస్ర కలశ స్థాపనము ' అనే గ్రంథాలున్నాయి.

ప్రాచీన తాళపత్ర నిధి నుండి డాక్టర్ రేజేటి వెంకట వేణుగోపాలాచార్యులు శ్రీ పాంచ రాత్ర ఆగమ శాస్త్ర గ్రంథాలను అనువదించి ముద్రించారు. ఇందులో పాంచ రాత్రాగమానుసారం స్వామి, అమ్మవార్ల ఉత్సవాలు, స్నపన తిరుమంజనం, సహస్ర కలశ స్నపన ప్రాశస్త్యం తదితర వివరాలు ఉన్నాయి.

మ‌రో గ్రంథం డాక్టర్ ఐఎల్ఎన్ చంద్రశేఖర రావు ర‌చించిన 'తిరుమ‌ల తొలిగడప దేవుని కడప'. ఇందులో పూర్వం కడప నుండి తిరుమలకు వచ్చేవారు తొలిగడపైన దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని తిరుమల చేరుకునేవారు. తాళ్లపాక అన్నమాచార్యులు కూడా దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ వ్రాసిన కీర్తనల వివ‌రాలు ఉన్నాయి.

టాపిక్