తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pariksha Pe Charcha 2025 : జ‌న‌వ‌రిలో ప‌రీక్షా పే చ‌ర్చా.. అమ‌లు చేసేందుకు విద్యా శాఖ ఉత్త‌ర్వులు

Pariksha Pe Charcha 2025 : జ‌న‌వ‌రిలో ప‌రీక్షా పే చ‌ర్చా.. అమ‌లు చేసేందుకు విద్యా శాఖ ఉత్త‌ర్వులు

HT Telugu Desk HT Telugu

23 December 2024, 17:13 IST

google News
    • Pariksha Pe Charcha 2025 : జనవరిలో జరిగే "ప‌రీక్షా పే చ‌ర్చా (పీపీసీ)-2025"కు ఉపాధ్యాయులు, విద్యార్థుల రిజిస్ట్రేష‌న్‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి నోడల్ అధికారుల నామినేషన్ల‌ను కూడా స్వీక‌రిస్తున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ వి.విజయరామరాజు ఉత్త‌ర్వులు జారీ చేశారు.
జ‌న‌వ‌రిలో ప‌రీక్షా పే చ‌ర్చా
జ‌న‌వ‌రిలో ప‌రీక్షా పే చ‌ర్చా

జ‌న‌వ‌రిలో ప‌రీక్షా పే చ‌ర్చా

ప‌రీక్షాపే చర్చా 2025 కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆరో త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ వరకు విద్యార్థులు.. రిజిస్ట్రేషన్ చేసుకుని, పాల్గొనేలా చేయాలనే సూచనలతో.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఉన్న‌త విద్యా మంత్రిత్వ శాఖ సెక్ర‌ట‌రీ ఇచ్చిన ఆదేశాల మేర‌కు.. ఈ ఉత్త‌ర్వులను విడుదల చేసిన‌ట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రంలోని పరీక్షా పే చర్చా (పీపీసీ) నిర్వహణకు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇంటర్మీడియట్ కాలేజీ ప్రిన్సిప‌ల్స్‌, జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డీఐఈటీ)లు, జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచనలు జారీ అయ్యాయి. ప్రధానమంత్రి పరీక్షా పే చర్చా (పీపీసీ)- 2025ని విజయవంతంగా అమలు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. పరీక్షా పే చర్చా కార్యక్రమం జనవరి 2025లో షెడ్యూల్ చేశారు.

ఇవీ సూచనలు..

1. సమన్వయం, వివరాల సమర్పణ (పేరు, హోదా, మొబైల్ నంబర్, ఈ- మెయిల్ ఐడీ) కోసం ప్రతి జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డీఐఈటీ) నుండి ఒక నోడల్ అధికారిని నామినేట్ చేయాలి.

2. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో మూడు విభాగాల్లో మొత్తం నమోదులో 50 శాతం భాగస్వామ్యాన్ని నిర్ధారించాలి. విద్యార్థులు (6-12 తరగతులు), ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల పిల్లలు, డీఐఈటీ విద్యార్థులు/ఉపాధ్యాయుల బల్క్ పోస్టింగ్‌తో పాటు 50 శాతం ఉండాలి.

3. పీపీసీ -2025 పోర్టల్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నమోదు ప్రక్రియను సులభతరం చేయాలి. అధికారిక వెబ్‌సైట్‌ https://innovateindia1.mygov.in/ లో నమోదు చేసుకోవాలి.

4. భాగస్వామ్యాన్ని పెంచడానికి పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రోగ్రామ్ వివరాలను విస్తృతంగా ప్ర‌చారం చేయడానికి ప్ర‌ణాళిక రూపొందించాలి.

5. క్రమం తప్పకుండా ప్ర‌చార పురోగతి, న‌మోదు పురోగ‌తిని నివేదించాలి. పీపీసీ- 2025 కోసం రాష్ట్ర నోడల్ అధికారితో సమన్వయం చేసుకోవాలి.

6. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పారదర్శకత, సమయానుకూలంగా అమలు అయ్యేలా ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.

7. రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యా శాఖ అధికారులు (డీఈవో)లు, జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డీఐఈటీ) ప్రిన్సిపాల్స్ కేంద్ర‌ ప్రభుత్వ సూచనల మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

8. రాష్ట్రంలోని పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు (ఆర్‌జేడీ), సంబంధిత డీఈవోలు, డీఐఈటీలను ప్రిన్సిపల్స్ అనుసరించాలి.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం