తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Dead Body In Water Drum Visakha Pm Palem Police Started Investigation

Dead body In Drum : నీళ్ల డ్రమ్ములో డెడ్ బాడీ…విశాఖలో కలకలం

HT Telugu Desk HT Telugu

05 December 2022, 7:49 IST

    • Dead body In Drum  విశాఖలో ఖాళీగా ఉన్న ఇంట్లో ఉన్న డ్రమ్ములో అస్థిపంజరం బయటపడటం కలకలం రేపింది. ఏడాదిగా అద్దె చెల్లించకుండా, ఇల్లు ఖాళీ చేయకపోవడంతో ఇంటి యజమాని సామాను తొలగిస్తుండటంతో డ్రమ్ములో శవం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
విశాఖలో డ్రమ్ములో డెడ్ బాడీ కలకలం....
విశాఖలో డ్రమ్ములో డెడ్ బాడీ కలకలం....

విశాఖలో డ్రమ్ములో డెడ్ బాడీ కలకలం....

Dead body In Drum విశాఖపట్నంలోని మధురవాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న కొమ్మాది వికలాంగుల కాలనీలో నీళ్ల డ్రమ్ములో కుళ్లిన స్థితిలో ఓ మహిళ శవం కనిపించడం కలకలం రేపింది. విశాఖలోని ఎండాడలో వెల్డింగ్‌ దుకాణం నిర్వహించే నండూరి రమేష్‌కు వికలాంగుల కాలనీలో ఓ ఇల్లు ఉంది. రుషి అనే వ్యక్తి రెండేళ్ల క్రితం రమేష్‌ వద్ద పని చేసేవాడు. అతని కుటుంబం నివసించేందుకు కాలనీలోని తన ఇంటిని రమేష్‌ అద్దెకు ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

NEET UG Admit Card 2024 : నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

విశాఖ నగర పరిధిలోని కొమ్మాది వికలాంగుల కాలనీలోని ఇంట్లో మహిళదిగా భావిస్తున్న అస్థిపంజరం కలకలం రేపింది. ఏడాది కాలంగా తాళం వేసి ఉన్న ఇంట్లో అస్థిపంజరం ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చిందనేది మిస్టరీగా మారింది. పోతిన మల్లయ్యపాలెం పోలీసుల కథనం మేరకు.. కొమ్మాదికి చెందిన రమేష్‌ వికలాంగుల కాలనీలో ఐదేళ్ల కిందట ఒక రేకుల షెడ్డును కొనుగోలు చేశారు.

2019లో శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన రిషి అనే వ్యక్తికి ఆ ఇంటిని అద్దెకిచ్చారు. రిషి నగరంలో వెల్డింగ్‌ పనులు చేసుకుంటూ, రమేష్‌ దగ్గర పనికి వచ్చేవాడు. అద్దెకు తీసుకున్న తర్వాత భార్యతో కలిసి ఆ ఇంట్లో ఉండేవాడు. 2021 జూలైలో భార్యను ప్రసవానికి తీసుకువెళుతున్నట్టు ఇంటి యజమానికి చెప్పి వెళ్లాడు. నెలలు గడిచినా రిషి రాకపోవడం, అద్దె చెల్లించకపోవడంతో రమేష్‌ రెండు రోజుల కిందట ఇంటి తాళం తీసి కొంత సామగ్రి బయటకు తీయించాడు.

ఆదివారం ఇంటిని శుభ్రం చేస్తున్న క్రమంలో 200 లీటర్ల ప్లాస్టిక్‌ డ్రమ్ము నుంచి దుర్వాసన వచ్చింది. అందులో పొడవాటి జుట్టు, మనిషి ఎముకలు, కొద్దిగా నీరు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. నార్త్‌ ఏసీపీ సీహెచ్‌ శ్రీనివాసరావు, పీఎం పాలెం సీఐ రామకృష్ణ అస్థిపంజరాన్ని పరిశీలించారు. ఇంటి యజమాని రమేష్‌తో రిషికి ఫోన్‌ చేయించడంతో, రిషి, అతని భార్య బతికే ఉన్నట్లు వాట్సాప్‌లో ఓ ఫొటో పంపాడు. రిషి చెప్పేది నిజమైతే ఆ మృతదేహం ఎవరిదై ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

రమేష్‌ ఇంట్తాలో దొరికిన శవం ఎవరిది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతి చెందిన మహిళ, గతంలో ఆ ఇంట్లో అద్దెకు ఉన్నవారికి సంబంధించినదా, ఇంకెవరినైనా హత్య చేసి శవాన్ని తెచ్చి ఇక్కడ దాచారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని రమేష్‌ పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

టాపిక్