తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Covid Warrior Doctor Ap Government Sanction 1.5crores For Doctor Treatment

Covid Warrior Doctor : కోవిడ్‌ను జయించి….. విధుల్లోకి కారంపూడి డాక్టర్…

HT Telugu Desk HT Telugu

27 November 2022, 10:38 IST

    • Covid Warrior Doctor కోవిడ్‌ తొలినాళ్లలో  ప్రజలకు చికిత్సనందిస్తూ దాని బారిన పడిన  ప్రభుత్వాస్పత్రి డాక్టర్ కోలుకున్నాడు. ప్రకాశం జిల్లా  కారంచేడులో పనిచేస్తూ కోవిడ్ బారిన పడి  ప్రాణాల కోసం పోరాడిన వైద్యుడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కోలుకున్నారు.  దాదాపు రెండు కోట్ల రుపాయలకు పైగా డాక్టర్ చికిత్స కోసం ఖర్చైనా ప్రభుత్వం అండగా నిలవడంతో మెల్లగా కోలుకోగలిగారు….
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెబుతున్న డాక్టర్ భాస్కర్‌ రావు
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెబుతున్న డాక్టర్ భాస్కర్‌ రావు

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెబుతున్న డాక్టర్ భాస్కర్‌ రావు

Covid Warrior Doctor ఆ డాక్టర్‌ కోవిడ్‌ను జయించారు. కోవిడ్ మహమ్మరి ప్రపంచం మీద విరుచుకు పడిన సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైన ప్రకాశం జిల్లా డాక్టర్ దాదాపు రెండేళ్ల తర్వాత పూర్తిగా కోలుకున్నారు. కరోనా వైరస్‌ సోకడంతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో ముఖ‌్యమంత్రి చొరవ తీసుకుని వైద్యం అందించడంతో పూర్తిగా కోలుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

AU MBA Admissions : ఆంధ్ర యూనివర్సిటీలో ఆన్ లైన్ ఎంబీఏ కోర్సులు, ఇలా దరఖాస్తు చేసుకోండి!

VJA Doctor Family: విజయవాడ డాక్టర్ ఫ్యామిలీలో దారుణం, కుటుంబ సభ్యుల్ని హత్య చేసి డాక్టర్ ఆత్మహత్య…

AP Model School Marks: ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష మార్కులు విడుదల… ఆన్‌లైన్‌‌లో చెక్ చేసుకోండి ఇలా..

AP Summer Upadtes: ఆత్మకూరులో అదరగొట్టిన ఎండలు.. 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు, నేడు 61 మండలాలకు వార్నింగ్

కరోనా బారిన పడిన వారికి వైద్యం చేస్తూ తానూ కూడా ఆ వ్యాధి బారిన పడి ఊపిరితిత్తులు దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరారు ఉన్న కారంచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ నర్తు భాస్కరరావు. కోవిడ్ బారిన పడటంతో ఆయన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినడంతో ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నారు. డాక్టర్ ప్రాణాలను కాపాడాలంటూ ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరడంతో తక్షణం స్పందించారు.

డాక్టర్‌ భాస్కర్‌ కోవిడ్‌-19 సమయంలో కారంచేడు పీహెచ్‌సీ నుంచి సుమారు 10 వేల కోవిడ్‌ టెస్ట్‌లు చేశారు. చుట్టు పక్కల ప్రాంతాలకు ప్రజలకు వైద్య సేవలు అందించారు. అదే కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. స్థానికంగా వైద్య చికిత్సలు అందించినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్‌ తరలించారు. ఆయనకు ఊపిరితిత్తుల మార్పిడి తప్పనిసరని తేల్చారు.

ఊపిరితిత్తుల మార్పిడికి సుమారు రూ.2 కోట్ల వరకూ ఖర్చవుతుందని హైదరాబాద్‌ కిమ్స్‌ హాస్పిటల్‌ వైద్యులు చెప్పడంతో వైద్యులు పెద్ద ఎత్తున సాయం చేశారు. ఆయన భార్య డాక్టర్‌ భాగ్యలక్ష్మి విజ్ఞప్తి మేరకు ఐఎంఏ వైద్యులు, ఐఆర్‌ఐఏ వైద్యులు, కార్డియాలజీ, అనస్థీషియా అసోసియేషన్, గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ పూర్వ విద్యార్ధులు కారంచేడుకు చెందిన ప్రజలు, ఎన్‌ఆర్‌ఐలు, అనేక మంది దాతలు దాదాపు రూ.50 లక్షలు సిద్ధం చేశారు.

ప్రకాశం జిల్లా డాక్టర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి మేరకు అప్పటి మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌లు ముఖ్యమంత్రిని కలిసి వైద్యానికి అయ్చే ఖర్చు విషయమై విజ్ఞప్తి చేయడంతో స్పందించిన సీఎం జగన్‌.. భాస్కరరావు వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. డాక్టర్ భాస్కరరావు ఊపిరితిత్తుల వైద్యానికి ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.1.50 కోట్లతో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

అప్పటి నుంచి ఆయన వైద్యుల సూచనతో ఇంటి వద్దే ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నెల 21న సీఎం క్యాంప్‌ ఆఫీసులో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తాను మళ్లీ విధుల్లో చేరతానని కోరడంతో ముఖ్యమంత్రి ఆయన్ని విధుల్లో చేర్చుకోవాలని ఆదేశించడంతో గుంటూరు జిల్లా నల్లపాడు రీజినల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ కి బదిలీ చేశారు. ఈ మేరకు ఏపీ పబ్లిక్‌ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.రామిరెడ్డి నుంచి ఉత్తర్వులు జారీచేశారు.