తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan : విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.694 కోట్లు జమ చేయనున్న సీఎం

CM Jagan : విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.694 కోట్లు జమ చేయనున్న సీఎం

HT Telugu Desk HT Telugu

29 November 2022, 20:43 IST

    • CM YS Jagan Madanappalle Tour : జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన నిధులు విడుదల కానున్నాయి. జులై-సెప్టెంబర్‌ 2022 త్రైమాసికానికి సంబంధించి.. 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లను విడుదల చేస్తారు సీఎం జగన్.
ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్

2022 జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రూ. 694 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ నవంబర్ 30న బటన్ నొక్కి.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు. మదనపల్లెలో నిర్వహించే.. కార్యక్రమంలో పాల్గొని నిధులను జమ చేస్తారు. పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ప్రభుత్వం ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపులు చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

జులై-సెప్టెంబర్‌ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లను సీఎం జగన్‌ 30వ తేదీన అంటే బుధవారం మదనపల్లెలో బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. 2017 సంవత్సరం నుండి పెట్టిన బకాయిలు.., రూ. 1,778 కోట్లతో కలిపి ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 12,401 కోట్లుగా ఉంది.

పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందిని చదివించవచ్చు. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.

జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ప్రభుత్వం సాయం చేస్తోంది. భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తోంది.