తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cm Jagan Released Jagananna Vidya Deevena Funds In Madanapalle

CM Jagan : పిల్లల చదువుకు పెట్టే ఖర్చు ఆస్తిగా భావిస్తున్నా

HT Telugu Desk HT Telugu

30 November 2022, 15:02 IST

    • CM Jagan On Education : పిల్లల చదవుకు పెట్టే ఖర్చును వ్యయంగా చూడకుండా ఆస్తిగా భావిస్తున్నాని సీఎం జగన్ చెప్పారు. పేదరికం వారి చదువుకు ఆటంకం కలగకూడదని పేర్కొన్నారు.
ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)
ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జగనన్న విద్యాదీవెన పథకం(Jagananna vidya deevena) నిధులను బటన్​ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు 684 కోట్ల నిధులను నేరుగా తల్లుల ఖాతాల్లోకే జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.

ట్రెండింగ్ వార్తలు

AP EMRS Inter Admissions : ఏపీ ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు-మే 3 నుంచి దరఖాస్తులు ప్రారంభం

AP Govt Salaries: ఎలక్షన్ ఎఫెక్ట్‌... ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, సర్వీస్ పెన్షన్లు... ఐదేళ్లలో ఇదే రికార్డ్

Papikondalu Tour Package : గోదావరిలో పాపికొండల మధ్య బోటు ప్రయాణం- రాజమండ్రి నుంచి ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

AP Inter Supplementary: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్, నేడు కూడా సప్లిమెంటరీ ఫీజు కట్టొచ్చు…

'పిల్లల చదువుకు పేదరికం ఆటంకం కాకూడదు. వారికి మనం ఇచ్చే ఆస్తి చదువే. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి.. 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు 684 కోట్ల నిధులను నేరుగా తల్లుల ఖాతాల్లోకే జమ చేశాం. విద్యాదీవెన, వసతిదీవెనకు రూ.12,401 కోట్లు ఖర్చుపెట్టాం.' అని సీఎం జగన్(CM Jagan) అన్నారు.

పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని సీఎం జగన్ అన్నారు. తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు గుర్తున్నాయని తెలిపారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామని చెప్పారు

కుటుంబాల తలరాత మారాలంటే, పేదరికం దూరం కావాలంటే, చదువు(education) మార్గమని సీఎం జగన్(CM Jagan) అన్నారు. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు(Chandrababu) హయాంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించామని జగన్ చెప్పారు.

'జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన(Jagananna Vasathi Deevena) కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తం రూ.12,401 కోట్లు ఇచ్చాం. డైరెక్ట్ గా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తానను భరోసా ఇస్తున్నాను. మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటాను. మీ పిల్లలను పూర్తిగా చదవించే బాధ్యత నాది. పిల్లల చదవుతో ఇంటింటా.. వెలుగు నింపాలని నాడు నేడు(Nadu Nedu) కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం. ఉపాధిగా చేరువగా విద్యారంగాన్ని తీసుకెళ్తున్నాం.' అని సీఎం జగన్ అన్నారు.

ఉన్నత విద్యలో కూడా మార్పులు తెచ్చామని సీఎం జగన్(CM jagan) చెప్పారు. ప్రఖ్యాత కంపెనీల సర్టిఫైడ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి కింద రూ.19,617 కోట్లు, జగనన్న విద్యాకానుకకు రూ.2,368 కోట్లు విద్యార్థులు, టీచర్లకు ట్యాబ్‌లకు రూ.685 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ గుర్తు చేశారు. మెుత్తం కలిపి మూడు సంవత్సరాల్లో విద్యారంగానికి 55 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.