తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cm Jagan Credited Input Subsidy And Ysr Sunna Vaddi Interest Subsidy To Farmers

CM Jagan : రైతుల ఖాతాల్లోకి నగదు జమ.. వారిని ఆదుకుంటేనే రాష్ట్రం బాగుంటుంది

HT Telugu Desk HT Telugu

28 November 2022, 16:49 IST

    • YSR Sunna Vaddi Scheme : వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామని సీఎం జగన్ చెప్పారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు.
రైతుల ఖాతాల్లోకి నగదు జమ
రైతుల ఖాతాల్లోకి నగదు జమ (YSRCP)

రైతుల ఖాతాల్లోకి నగదు జమ

తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌(CM Jagan) బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేశారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ(Input Subsidy), వైఎస్సార్‌ సున్నా వడ్డీ(YSR Sunna Vaddi) పంట రుణాలను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. 62 శాతం జనాభా వ్యవసాయ రంగంపైనే.. ఆధారపడ్డారని సీఎం జగన్(CM Jagan) అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటేనే.. ఏ రాష్ట్రమైనా బాగుంటుందన్నారు. మూడేళ్ల 5 నెలల కాలంలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామన్నారు. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే.. అదే సీజన్లో ఇస్తున్నామన్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

'రూ.200 కోట్లు రైతుల ఖాతాల్లోకి(Farmers Account) జమ చేస్తున్నాం. 21.31 లక్షలమందికి రూ.1,834 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ(Input Subsidy) ఇచ్చాం. 8 లక్షల 22 వేల 411 మంది రైతులకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్ము చెల్లిస్తున్నాం. ఏడాదిలోపు చెల్లించిన రైతులకు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తున్నాం. రైతు భరోసా(Rythu Bharosa) ద్వారా మూడేళ్లలో రూ.25,971 కోట్లు ఇచ్చాం. బీమా సొమ్ము రూపంలో రూ.6,685 కోట్లు రైతులకు చెల్లించాం.' అని సీఎం జగన్ అన్నారు.

రబీ 2020-21కి సంబంధించి.. అర్హత ఉన్న 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు జమ చేశారు. ఖరీఫ్‌ 2021 సీజన్‌(kharif season)కు సంబంధించి.. 5.68 లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ.115.33 కోట్లు జమ అయ్యాయి. ఖరీఫ్‌-2022 సీజన్‌లో జూలై నుంచి అక్టోబర్‌ మధ్య గోదావరి వరదలు(Godavari Floods), అకాల వర్షాలతో దెబ్బతిన్న 45,998 మంది రైతులకు రూ.39.39 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ(input Subsidy)ని కూడా ప్రభుత్వం(Govt) జమ చేసింది.

గడచిన మూడేళ్లలో చూసుకుంటే.. 20.85 లక్షల మందికి రూ.1795.40 కోట్ల పంట నష్ట పరిహారం జమ చేశారు. ఇప్పుడు ఇచ్చిన మెుత్తంతో కలిపితే.. 21.31 లక్షల మంది రైతులకు రూ.1834 ఇన్ పుట్ సబ్సిడీ జమ అయినట్టు. మూడేళ్ల కాలంలో 65.65 లక్షల మందికి రూ.1,282.11 కోట్ల సున్నా వడ్డీ(Sunna Vaddi) రాయితీ సొమ్ము జమ అయింది. తాజా లెక్కలతో 73.88 లక్షల మంది అన్నదాత(Farmers)లకు రూ.1,834.55 కోట్ల సున్నా వడ్డీ రాయితీ అందించింది ప్రభుత్వం.