తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Beers Looted: బీర్ల వ్యాన్ బోల్తా... సీసాలు ఎత్తుకు పోయిన జనం

Beers looted: బీర్ల వ్యాన్ బోల్తా... సీసాలు ఎత్తుకు పోయిన జనం

HT Telugu Desk HT Telugu

06 June 2023, 8:39 IST

    • Beers looted: రోడ్డు ప్రమాదంలో ఓ బీర్ల వ్యాన్ బోల్తా కొట్టింది. ప్రమాదానికి గురైన వాహనం నుంచి బీరు సీసాలున్న బాక్సులు రోడ్డుపై పడిపోయాయి. దీంతో వాటిని  దక్కించుకునేందుకు జనం పోటీలు పడ్డారు. 
రోడ్డున పడిపోయిన బీరు సీసాలు
రోడ్డున పడిపోయిన బీరు సీసాలు

రోడ్డున పడిపోయిన బీరు సీసాలు

Beers looted: రోడ్డు ప్రమాదానికి గురైన వాహనంలో బీరు సీసాలు కింద పడిపోవడంతో వాటిని దక్కించుకోడానికి జనం ఎగబడ్డడారు. పెద్ద సంఖ్యలో బీర్ బాటిళ్ల బాక్సులు రోడ్డుపై పడిపోవడంతో అటుగా వెళుతున్న జనం సీసాలతో ఊడయించారు. ఎవరికి దక్కిన బాటిళ్లతో క్షణాల్లో వాహనాన్ని ఖాళీ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 150 ఉద్యోగాలు - నెలకు రూ. 70 వేల జీతం, అర్హతలివే

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై బీరుసీసాలతో వెళ్తున్న వ్యాన్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు వందల సంఖ్యలో బీరు కేసులు నేలపాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం టాటా ఏస్ వాహనంలో ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్‌ గోడౌన్‌ అనకాపల్లి నుంచి నర్సీపట్నానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

లారీ బోల్తా కొట్టగానే అందులో ఉన్న కొన్ని బాక్సుల్లో సీసాలు పగిలిపోయాయి. చాలా వరకు బాటిళ్లు పగలకుండానే ఉండిపోయాయి. వాహనం రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో పగలని సీసాలను తీసుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు.

బోల్తా పడిన విషయాన్నే పక్కకు పెట్టేసి మరీ చేతికి దొరికిన బీరు బాటిల్స్‌ను పట్టుకుని పారిపోయారు. రెండు చేతుల్లో అందినన్ని బీరు సీసాలను పట్టుకుని పరుగులు పెట్టడం వైరల్‌గా మారింది. బీర్ల కోసం జనం పాట్లు పడుతూ ఇలా అందినకాడికి పట్టుకుపోవడం సోషల్ మీడియాలో సైతం కనిపించింది.