తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ar Police Constable Arrested For Criticising Cm Jagan

Cop Arrest in AP: సీఎం జగన్ పై కామెంట్స్ … ఏఆర్ కానిస్టేబుల్ అరెస్ట్

HT Telugu Desk HT Telugu

04 February 2023, 12:26 IST

    • Police constable Arrest: సీఎం జగన్ పై దూషణలు చేసిన ఓ కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యాడు. అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
కానిస్టేబుల్ అరెస్ట్
కానిస్టేబుల్ అరెస్ట్

కానిస్టేబుల్ అరెస్ట్

Police constable Criticising CM Jagan: అతను ఏఆర్ కానిస్టేబుల్...! ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే పెట్రోలింగ్ విధుల్లో ఉండగా... సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. జీతాల విషయంలో కానిస్టేబుల్ దూషణలు చేశాడు. ఇదంతా కూడా ఓ వ్యక్తి రికార్డ్ చేయగా... సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదీ కాస్త ఉన్నతాధికారుల దృష్టికి చేరటంతో... చర్యలు చేపట్టారు. సదరు కానిస్టేబుల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ట్రెండింగ్ వార్తలు

Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య

AP TS Summer Updates: పగటిపూట బయట తిరగకండి, ముదురుతున్న ఎండలు… వడదెబ్బకు ప్రాణాలు విలవిల

AP EMRS Inter Admissions : ఏపీ ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు-మే 3 నుంచి దరఖాస్తులు ప్రారంభం

AP Govt Salaries: ఎలక్షన్ ఎఫెక్ట్‌... ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, సర్వీస్ పెన్షన్లు... ఐదేళ్లలో ఇదే రికార్డ్

ఏం జరిగిందంటే,,,

తన్నీరు వెంకటేశ్వరరావు.. ఏఆర్ కానిస్టేబుల్. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో ఉండగా ఓ రోజు గౌరవరంలో టీ తాగేందుకు ఓ టీస్టాల్ దగ్గర ఆగారు. ఆ సమయంలో టీస్టాల్ వ్యక్తికి, కానిస్టేబుల్‌కు మధ్య సంభాషణ జరిగింది. ఈ సమయంలో సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు వెంకటేశ్వరరావు. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. వెంకటేశ్వరరావును జీతాలపై టీస్టాల్ వ్యక్తి ప్రశ్నించారు. దీంతో కానిస్టేబుల్ నోటి దురుసుతో బూతులు తిట్టారు. ఇదంతా కూడా ఉన్నతాధికారుల దృష్టికి చేరింది.

కానిస్టేబుల్ వ్యవహరంపై కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం జగ్గయ్యపేట న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఆయనకు 14 రోజులు న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో జగ్గయ్యపేట సబ్‌జైలుకు తరలించారు.