తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Si Prelims Key : ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ కీ .. ఎన్ని మార్కులు వస్తున్నాయో చూశారా ?

AP SI Prelims Key : ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ కీ .. ఎన్ని మార్కులు వస్తున్నాయో చూశారా ?

HT Telugu Desk HT Telugu

20 February 2023, 14:16 IST

    • AP SI Prelims Key : ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ప్రాథమిక పరీక్ష కీ విడుదలైంది. పేపర్ - 1, పేపర్ - 2 కి సంబంధించిన కీలని ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఫిబ్రవరి 23 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు వెల్లడించింది.
ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ కీ విడుదల
ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ కీ విడుదల

ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ కీ విడుదల

AP SI Prelims Key : ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ప్రాథమిక పరీక్షలని... ఫిబ్రవరి 19న రాష్ట్రవ్యాప్తంగా 291 సెంటర్లలో నిర్వహించిన విషయం తెలిసిందే. 1,71, 963 మంది ఎస్ఐ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోగా... 1,51,243 మంది అభ్యర్థులు ప్రాథమిక పరీక్షకు హాజరయ్యారు. హాజరు శాతం 88 శాతంగా నమోదైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు

AP Rains Alert: ఏపీలో చల్లబడిన వాతావరణం, పలు జిల్లాల్లో భారీ వర్షం- పిడుగుపాటు హెచ్చరికలు జారీ

AP RGUKT Admissions 2024 : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు, మే 8 నుంచి జూన్ 25 వరకు అప్లికేషన్లు స్వీకరణ

AP ECET 2024: రేపీ ఏపీ ఈసెట్‌ 2024, ఇప్పటికే హాల్‌ టిక్కెట్ల విడుదల చేసిన JNTU కాకినాడ

AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ 2024 సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేసిన జేఎన్‌టియూ కాకినాడ

ఈ ఎగ్జామ్ కీ ని సోమవారం (ఫిబ్రవరి 20న) ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి (APSLPRB) విడుదల చేసింది. పేపర్ - 1, పేపర్ - 2 లలో నాలుగు సెట్ల కీ ని వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. బోర్డు వెల్లడించిన సమాధానాలపై అభ్యంతరాలను ఫిబ్రవరి 23 ఉదయం 11 గంటలలోగా పంపాలని కోరింది. SCTSI-PWT@slprb.appolice.gov.in మెయిల్ కి.. నిర్దేశిత ఫార్మాట్ లో అభ్యంతరాలను తెలపవచ్చని పేర్కొంది. గడువు సమయం దాటాక వచ్చే అభ్యంతరాలను స్వీకరించబోమని స్పష్టం చేసింది.

ఏపీలో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి (APSLPRB) నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 411 పోస్టులను భర్తీ చేయనున్నారు. పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ-ఎస్టీ-ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో శారీరక ధృడత్వ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారినే మెయిన్స్ పరీక్షకు అనుమతిస్తారు.

సివిల్ ఎస్ఐ పోస్టులకు సంబంధించి... పురుష, మహిళా అభ్యర్థులు తప్పనిసరిగా 1600 మీటర్ల పరుగులో క్యాలిఫై కావాల్సి ఉంటుంది. వంద మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లలో ఏదో ఒకదాంట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. రిజర్వ్ ఎస్ఐ పోస్టులకు అన్ని ఈవెంట్లలలో.. అంటే 1600 మీటర్లు.. 100 మీటర్లు.. లాంగ్ జంప్ లో తప్పనిసరిగా అర్హత సాధించాలి.

1600 మీటర్ల పరుగు పూర్తి చేయడానికి ... పురుషులకి 8 నిమిషాలు, మహిళా అభ్యర్థులకి 10 నిమిషాల 30 సెకండ్ల సమయం ఉంటుంది. 100 మీటర్ల పరుగుని పురుషులు 15 సెకండ్లు... మహిళలు 18 సెకండ్ల లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. పురుష అభ్యర్థులకి లాంగ్ జంప్ 3.80 మీటర్లు కాగా... మహిళా అభ్యర్థులకి 2.75 మీటర్లు. ఈ ఈవెంట్లలో ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.