తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Appsc Recruitment 2022 Apply Online For 8 Computer Draughtsman Jobs Here Is Application Process

APPSC Job Notification 2022 : ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్.. జీతం ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu

18 October 2022, 19:11 IST

    • APPSC Computer Draughtsman Grade II Recruitment 2022 : నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

APPSC.. A.P సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్-ఆర్డినేట్ సర్వీస్‌లో కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-II పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 8 ఖాళీలు ఉన్నాయి. రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు 10 నవంబర్ 2022 నుండి ప్రారంభమవుతుంది. చివరి తేదీ 30 నవంబర్ 2022 వరకు ఉంది. ఈ పోస్ట్‌కి దరఖాస్తు చేయబోయే అభ్యర్థులందరూ అర్హత ప్రమాణాలు, విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ మొదలైనవాటిని చూసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

అభ్యర్థుల వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. SC, STలకు 10 ఏళ్లు, BC, EWSలకు వయో సడలింపు 5 సంవత్సరాలు ఉంది. పోస్ట్ ఎంపిక కోసం కమిషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ మోడ్‌లో పరీక్ష రాయలి. పరీక్ష ఆబ్జెక్టివ్ రకంగా ఉంటుంది. కర్నూలు, గుంటూరు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరులో ఈ ఉద్యోగాలు ఉన్నాయి.

ఎలా అప్లై చేయాలి

APPSC అధికారిక వెబ్‌సైట్ సైట్‌కు వెళ్లాలి.

హోమ్ పేజీలో 'నోటిఫికేషన్' విభాగాన్ని ఎంచుకోండి.

ఆ పేజీలో సంబంధిత నోటిఫికేషన్‌ను చూడాలి.

క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.

సరైన వివరాలు నమోదు చేసి.. సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి.

APPSC Computer Draughtsman Grade II Application Fee : ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి APPSC కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్ II అప్లికేషన్ ఫీజు చెల్లించడం తప్పనిసరి. ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర చెల్లింపుల ద్వారా చేయోచ్చు. జనరల్ అభ్యర్థులు 330 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,బీసీ తదితరులు 250 రూపాయలు చెల్లించాలి.

షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు A.P సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్-ఆర్డినేట్ సర్వీస్‌లో కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మెన్ గ్రేడ్-II పోస్ట్ కు ఎంపికవుతారు. సంబంధిత బోర్డు నుండి నెలకు రూ.34,580 నుంచి రూ.107210 వరకు జీతం పొందడానికి అర్హులు.

అభ్యర్థి తప్పనిసరిగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పారిశ్రామిక శిక్షణా సంస్థలో డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) ట్రేడ్ (సర్వేయింగ్ సబ్జెక్ట్‌లలో ఒకటిగా ఉన్న 2 సంవత్సరాల కోర్సు)లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.