తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Group -1: ఏపీ గ్రూప్ -1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల

APPSC Group -1: ఏపీ గ్రూప్ -1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల

25 May 2023, 7:00 IST

    • APPSC Group 1 Updates: గ్రూప్ -1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్ ఇచ్చింది ఏపీపీఎస్సీ. తుది పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏపీ గ్రూప్ 1 హాల్ టికెట్లు విడుదల
ఏపీ గ్రూప్ 1 హాల్ టికెట్లు విడుదల

ఏపీ గ్రూప్ 1 హాల్ టికెట్లు విడుదల

Andhra Pradesh Public Service Commission: గ్రూప్ - 1 అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మెయిన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లను బుధవారం విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

జూన్‌ 3 నుంచి 10వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 10 జిల్లా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. సాధ్యమైనంత త్వరగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇలా డౌన్లోడ్ చేసుకోండి..

గ్రూప్ -1 అభ్యర్థులు మొదటగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ లోకి వెళ్లాలి.

గ్రూప్ -1 హాల్ టికెట్లు అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ను ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ చేయగానే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 111 పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ గతేడాది సెప్టెంబర్ 30న గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకుగాను మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 8న... 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు 82.38శాతం మంది హాజరయ్యారు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించిన అధికారులు... అందరినీ ఆశ్చర్యపరుస్తూ... రికార్డు స్థాయిలో 20 రోజుల్లోనే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వెలువరించారు. 1 : 50 పద్ధతిలో ఫలితాలు వెల్లడించిన ఏపీపీఎస్సీ... 6,455 మంది మెయిన్స్ కు అర్హత సాధించినట్లు తెలిపింది. మెయిన్స్ కు అర్హత సాధించిన వారి వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.

భర్తీ చేసే పోస్టుల వివరాలు:

డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు - 1

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 1

డిప్యూటీ కలెక్టర్ పోస్టులు - 10

అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు - 12

డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోస్టులు - 13

డివిజనల్/డిస్ట్రిక్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులు - 2

అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్‌ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు - 8

రీజనల్‌ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్‌ పోస్టులు - 2

మండల పరిషత్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు - 7

జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు - 3

జిల్లా గిరిజన సంక్షేమ ఆఫీసర్‌ పోస్టులు - 1

జిల్లా బీసీ సంక్షేమ ఆఫీసర్‌ పోస్టులు - 2

మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-II పోస్టులు - 6

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రెటరీ అండ్‌ ట్రెజర్‌ గ్రేడ్-II పోస్టులు - 18

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 4

గ్రూప్‌–1 పోస్టులు 92 ఉండగా ఇందులో 17 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జాబ్స్ ఉన్నాయి.