AP TS Weather : తెలుగు రాష్ట్రాల్లో రాగల 5 రోజులు తేలికపాటి వర్షాలు- పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు
21 April 2024, 5:50 IST
- AP TS Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. రాగల ఐదు రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో వైపు పలు జిల్లాల్లో తీవ్రగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
రాగల 5 రోజులు తేలికపాటి వర్షాలు
AP TS Weather : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ(AP TS Weather Report) వర్ష సూచన చెప్పింది. ఏపీలో రాగల 6 ఏడు రోజుల వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో నేటి నుంచి రాగల ఐదు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు విస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో రాగల 5 రోజులు వర్షాలు కురిసే అవకావం ఉందని ఐఎండీ తెలిపింది.
ఉత్తర కోస్తా, యానం
ఉత్తర కోస్తాంధ్ర(North Coastal Andhra), యానంలో నేటి(ఏప్రిల్ 21) నుంచి రాగల ఐదు రోజుల పాటు వరకు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు(AP Weather) ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే ఉత్తర కోస్తాంధ్ర, యానంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. వేడి, తేమతో అసౌకర్య వాతావరణ ఉండే అవకాశం ఉందని ప్రకటించింది.
దక్షిణ కోస్తాంధ్ర
దక్షిణ కోస్తాంధ్రలో(South Coastal Andhra Weather) ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు(AP Rains) లేదా ఉరుములతో జుల్లులు ఒకటి లేదా రెండు చోట్లు కురిసి అవకాశం ఉందని అమరావతి వాతారణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వేడి, తేమతో అసౌకర్య వాతావరణ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 22 నుంచి 27 ఉదయం 8.30 గంటలకు వరకు వాతావరణ పొడిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
రాయలసీమ
రాయలసీమలో(Rayalaseema Weather) ఇవాళ తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జుల్లులు ఒకటి లేదా రెండు చోట్లు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుముులు, మెరుపులతో ఈదురుగాలులు గంటకు 50-60 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని తేమతో అసౌకర్య వాతావరణ ఏర్పడుతుందని తెలిపింది. రేపటి నుంచి ఈ నెల 27 వరకు రాయలసీమలో పొడి వాతావరణ ఉందని ప్రకటించింది.
45 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
ఇవాళ 45 మండలాల్లో తీవ్రవడగాల్పులు(AP Heat Wave),197 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఎల్లుండి(ఏప్రిల్ 22న) 70 మండలాల్లో తీవ్రవడగాల్పులు,116 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.1°C, మన్యం జిల్లా నవగాం, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 43.9°C, చిత్తూరు జిల్లా నింద్రలో 43.6°Cఅధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణ వాతావరణ (TS Weather Report)చల్లబడింది. హైదరాబాద్ (Hyderabad Rains)సహా పలు ప్రాంతాల్లో శనివారం వర్షాలు పడ్డాయి. ఏప్రిల్ 21 నుంచి 26 వరకు ఐదు రోజుల వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు చెప్పారు. విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందన్నారు. ద్రోణి ప్రభావం తెలంగాణపై బలంగా ఉందన్నారు. దీంతో రాగల ఐదు రోజులు హైదరాబాద్, మెదక్ , సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన పడే అవకాశం ఉందని ప్రకటించారు.