తెలుగు న్యూస్ / ఫోటో /
TS Weather Updates : చల్లబడిన వాతావరణం, తగ్గనున్న ఉష్ణోగ్రతలు - మరికొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు!
- TS AP Weather Updates : తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. ఇవాళ మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత…. చల్లబడింది. ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఏపీకి కూడా రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లబడింది. ఆయా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(2 / 6)
శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ… ఆ తర్వాత వాతావరణం చల్లబడింది. ఆసిఫాబాద్, నిజమాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ,వరంగల్, జనగాం, భూపాలపల్లి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(3 / 6)
ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మూడు - నాలుగు గంటల్లో ఈ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.
(4 / 6)
తెలంగాణ ప్రాంతంలో ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
(5 / 6)
ఈ రెండు మూడు రోజులు మళ్లీ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఇతర గ్యాలరీలు