తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap State Level Police Recruitment Board Postponed The Pet And Pmt Exams In Constable Recruitment

Ap Constable Recruitment : కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్..ఫిజికల్ పరీక్షల వాయిదా

HT Telugu Desk HT Telugu

10 March 2023, 13:29 IST

    • Ap Constable Recruitment ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆ‎ధ్వర్యంలో జరుగుతున్న కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో శారీరక సామర్థ్య పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు బోర్డు ఛైర్మన్ ప్రకటించారు. అసెంబ్లీ నిర్వహణ, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు వాయిదా పడ్డాయి.
కానిస్టేబుల్ నియామకాల్లో పిజికల్ ఫిట్నెస్ పరీక్షల వాయిదా
కానిస్టేబుల్ నియామకాల్లో పిజికల్ ఫిట్నెస్ పరీక్షల వాయిదా

కానిస్టేబుల్ నియామకాల్లో పిజికల్ ఫిట్నెస్ పరీక్షల వాయిదా

Ap Constable Recruitment ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆ‎ధ్వర్యంలో జరుగుతున్న కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో శారీరక సామర్థ్య పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు బోర్డు ఛైర్మన్ ప్రకటించారు. సాంకేతిక కారణాల నేపథ్యంలో ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌(PMT), ఫిజికల్ ఎలిజిబిలిటీ(PET) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

AP Govt Salaries: ఎలక్షన్ ఎఫెక్ట్‌... ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, సర్వీస్ పెన్షన్లు... ఐదేళ్లలో ఇదే రికార్డ్

Papikondalu Tour Package : గోదావరిలో పాపికొండల మధ్య బోటు ప్రయాణం- రాజమండ్రి నుంచి ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

AP Inter Supplementary: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్, నేడు కూడా సప్లిమెంటరీ ఫీజు కట్టొచ్చు…

AP TS Summer Updates: ఏప్రిల్ రికార్డు… 46 డిగ్రీలు దాటేసిన ఎండలు, మేలోను మంటలే… దడ పుట్టిస్తున్న వాతావరణం

ఆంధ్రప్రదేశ్‌లో 6100కానిస్టేబుల్ నియామకాల కోసం గత ఏడాది నవంబర్‌లో పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరీక్షలను నిర్వహించింది. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా ఇప్పటికే ప్రాథమిక రాత పరీక్షను కూడా నిర్వహించారు.

ప్రాథమిక రాతపరీక్షల్లో అర్హత సాధించిన వారికి పిఈటీ, పిఎంటి పరీక్షలకు హాజరయ్యేందుకు కాల్‌ లెటర్స్‌ కూడా జారీ చేశారు. మార్చి 14నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరక సామర్ధ్య పరీక్షల్ని నిర్వహించేందుకు బోర్డు షెడ్యూల్ ఖరారు చేసింది. తాజాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పరీక్షల్ని వాయిదా వేశారు.

మరోవైపు కానిస్టేబుల్ ఎంపికల కోసం ముందస్తు షెడ్యూల్ ఖరారు చేసినా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాటిని వాయిదా వేస్తున్నట్లు బోర్డు ఛైర్మన్ ప్రకటించారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.

కానిస్టేబుల్ నియామక పరీక్షల కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో 997 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4,59,182మంది హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 95,208మంది అర్హత సాధించారు.

ప్రాథమిక పరీక్షల్ని నిర్వహించిన తర్వాత ప్రిలిమినరీ కీను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ప్రాథమిక కీపై 2261 అభ్యంతరాలు వచ్చినట్లు బోర్డు వెల్లడించింది. మరో ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు మార్చాలని కోరుతూ 80మంది అభ్యర్థులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు విచారణ వాయిదా వేసింది.

కానిస్టేబుల్ నియామకాలకు భారీగా పోటీ

కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో ప్రిలిమ్స్‌ పరీక్షలో అర్హత సాధించి ఫేజ్‌-2 పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా పీఎంటీ, పీఈటీ పరీక్షలకు సంబంధించిన కాల్‌ లెటర్లు మార్చి 10 మధ్యాహ్నం 3గంటల వరకు అందుబాటులో ఉంటాయని పోలీసు నియామక మండలి తెలిపింది. ఇందుకోసం అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో పాటు మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్‌ https://slprb.ap.gov.in/ను సందర్శించాల్సి ఉంటుంది.

ఒక్కో పోస్టుకు 16మంది పోటీ..

కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా జనవరి 22న ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,59,182 మంది హాజరయ్యారు. వీరిలో 95,209 మంది (20.73%) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో పోస్టుకు 16 మంది పోటీపడుతున్నారు.

ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 95,209 మందికి త్వరలో దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ) నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్‌ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారంతా స్టేజ్‌-2 పరీక్షల కోసం ఫిబ్రవరి 13 నుంచి 20 వరకూ పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. దేహదారుఢ్య పరీక్షల సమయంలోనే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుంది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారిలో 77,876 మంది పురుషులు, 17,332 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 3,63,432 మంది పురుషులు పరీక్ష రాయగా వారిలో 21.42 శాతం మంది, 95,750 మంది మహిళలు పరీక్ష రాయగా వారిలో 18.10 శాతం మంది అర్హత సాధించారు.

కానిస్టేబుల్ నియామక పరీక్షల కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో 997 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4,59,182మంది హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 95,209మంది అర్హత సాధించారు.

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలకు సంబందించిన అప్డేట్స్‌ కోసం ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ ను పరిశీలించాలని సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా 94414 50639, 91002 03323 నంబర్లను సంప్రదించాలని బోర్డు ఛైర్మన్ సూచించారు.