తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Model Schools: 282 టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్ - పరీక్ష లేకుండానే భర్తీ

AP Model Schools: 282 టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్ - పరీక్ష లేకుండానే భర్తీ

06 August 2022, 16:28 IST

    • ap model schools jobs: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పీజీటీ, టీజీటీలను తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది.
282 టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌
282 టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ (pms.ap.gov.in)

282 టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

ap model schools recruitment 2022: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూళ్లలో 282 మందిని కాంట్రాక్టుపై తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 211 పీజీటీ, 71 టీజీటీ పోస్టులు ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థుల అర్హతలు, ఇతర ప్రాధమ్యాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది.జోన్, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. టీజీటీ పోస్టులు జోన్‌ 1లో 17, జోన్‌ 3లో 23, జోన్‌ 4లో 31 ఉండగా పీజీటీ పోస్టులు జోన్‌ 1లో 33, జోన్‌ 2లో 4, జోన్‌ 3లో 50, జోన్‌ 4లో 124 ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

పోస్టులు - 208(టీజీటీ, పీజీటీ)

దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 8, 2022

అర్హత - సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి

వయస్సు - 18 నుంచి 44 ఏళ్ల లోపు

సీనియార్టీ జాబితా వెల్లడి - ఆగస్టు 23, 2022

జోన్ల వారీగా ఇంటర్వూలు - ఆగస్టు 29, 2022

డెమో - ఆగస్టు 30, సెప్టెంబర్ 1 ,2022

తుది జాబితా - సెప్టెంబర్ 5 ,2022

రిపోర్టు చేయాల్సిన తేదీ - సెప్టెంబర్ 9 , 2022

పీజీటీ పోస్టులకు రెండేళ్ల మాస్టర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టు మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేయాలి. ఇక టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు లేదా యూజీసీ గుర్తింపు ఉన్న కాలేజీల్లో డిగ్రీ కోర్సు పూర్తి చేసి 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులలో బీఈడీ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హతలు, వెయిటేజీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్లో పొందుపరిచింది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మినిమం టైమ్‌ స్కేలు ప్రకారం వీరికి వేతనాలు ఇస్తారని వివరించింది.

NOTE:

అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తులను సమర్పించేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

టాపిక్