AP Model School Admissions : అలర్ట్... ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు - లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
29 March 2024, 21:13 IST
- AP Model Schools Admissions 2024: ఏపీ మోడల్ స్కూల్ అడ్మిషన్లకు సంబంధించి మరో అప్డేట్ అందింది. మార్చి 31వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో… గడువు పొడిగించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.
ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలు
AP Model Schools Admissions 2024: ఏపీ మోడల్ స్కూళ్లలో(AP Model Schools Admissions) ఆరో తరగతి ప్రవేశాల గడువును పొడిగించింది పాఠశాల విద్యాశాఖ. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఈ గడువు మార్చి 31వ తేదీతో ముగియనుంది. అయితే ఈ గడువును ఏప్రిల్ 6వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 21వ తేదీన ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుందని తెలిపింది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు 2024-25 విద్యాసంవత్సరానికిగాను ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.
ముఖ్య వివరాలు:
ప్రవేశాలు - ఏపీ మోడల్ స్కూల్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత కలిగి ఉండాలి.
ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2012 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2010 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఫీజు - ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 75 కట్టాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం - మార్చి 01,2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 06 ఏప్రిల్ .2024.
పరీక్ష తేదీ -21. ఏప్రిల్ .2024 (ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఉండే స్థానిక మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.)
అధికారిక వెబ్ సైట్ - https://apms.apcfss.in/
అప్లికేషన్ లింక్ - https://apms.apcfss.in/StudentLogin.do
ఇంటర్ ప్రవేశాల దరఖాస్తులు ప్రారంభం….
APMS Inter Admissions 2024: ఏపీ మోడల్ స్కూళ్లలోని ఇంటర్ ప్రవేశాలకు(APMS Inter Admissions 2024) సంబంధించి ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.... 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు కల్పిస్తారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి మాత్రం ఈ ప్రవేశాలు ఉంటాయి. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాలి. మార్చి 28 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మే 22వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ వివరాలను పేర్కొంది. పదో తరగతి అర్హత పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం పరీక్ష రాసే వారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
అడ్మిషన్ల ప్రకటన - ఏపీ మోడల్ స్కూల్
ప్రవేశాలు - ఇంటర్ ఫస్ట్ ఇయర్
ఏపీలోని 164 మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌లలో అడ్మిషన్లు ఇస్తారు.
అర్హత - పదో తరగతి అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం - ఆన్ లైన్
అప్లికేషన్ ఫీజు - ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభం - మార్చి 28, 2024.
దరఖాస్తులకు తుది గడువు - మే 22, 2024.
ఎంపిక విధానం - పదో తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల ఆధారంగా తుది జాబితాను వెల్లడిస్తారు.
అధికారిక వెబ్ సైట్ - https://apms.apcfss.in/