AP Model Schools : ఏపీ మోడల్ స్కూల్ 'ఇంటర్' ప్రవేశాల నోటిఫికేషన్ జారీ - ముఖ్య తేదీలివే-ap model schools intermediate admissions notification released check the key details are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Model Schools : ఏపీ మోడల్ స్కూల్ 'ఇంటర్' ప్రవేశాల నోటిఫికేషన్ జారీ - ముఖ్య తేదీలివే

AP Model Schools : ఏపీ మోడల్ స్కూల్ 'ఇంటర్' ప్రవేశాల నోటిఫికేషన్ జారీ - ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 23, 2024 06:41 AM IST

APMS Inter Admissions 2024: ఏపీ మోడల్ స్కూల్ లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 28వ తేదీన దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలు
ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలు

APMS Inter Admissions 2024: ఏపీ మోడల్ స్కూళ్లలోని ఇంటర్ ప్రవేశాలకు(APMS Inter Admissions 2024) సంబంధించి ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా.... 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు కల్పిస్తారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి మాత్రం ఈ ప్రవేశాలు ఉంటాయి. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాలి. మార్చి 28 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. మే 22వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ వివరాలను పేర్కొంది. పదో తరగతి అర్హత పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం పరీక్ష రాసే వారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు:

అడ్మిషన్ల ప్రకటన - ఏపీ మోడల్ స్కూల్

ప్రవేశాలు - ఇంటర్ ఫస్ట్ ఇయర్

ఏపీలోని 164 మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌లలో అడ్మిషన్లు ఇస్తారు.

అర్హత - పదో తరగతి అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు విధానం - ఆన్ లైన్

అప్లికేషన్ ఫీజు - ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తులు ప్రారంభం - మార్చి 28, 2024.

దరఖాస్తులకు తుది గడువు - మే 22, 2024.

ఎంపిక విధానం - పదో తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల ఆధారంగా తుది జాబితాను వెల్లడిస్తారు.

అధికారిక వెబ్ సైట్ - https://apms.apcfss.in/

ఆరో తరగతి ప్రవేశాలు….

AP Model Schools Admissions 2024: ఆంధ్రప్రదేశ్ లోని ఆదర్శ పాఠశాలల్లో (AP Mode Schools) ఆరో తరగతిలోప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. మార్చి 1వ తేదీన ప్రకటన విడుదలకాగా… మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష జరగనుంది. https://apms.apcfss.in/ వెబ్ సైట్ లో వివరాలను చూడవచ్చు.

ముఖ్య వివరాలు:

  • ప్రవేశాలు - ఏపీ మోడల్ స్కూల్స్
  • ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.
  • ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత కలిగి ఉండాలి.
  • ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2012 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2010 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి.
  • రుసుం - ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 75 కట్టాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం - మార్చి 01,2024.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31. మార్చి.2024.
  • పరీక్ష తేదీ -21. ఏప్రిల్ .2024 (ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఉండే స్థానిక మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.)