తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Amvi Posts : ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసిన ఏపీ హైకోర్టు…

APPSC AMVI Posts : ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసిన ఏపీ హైకోర్టు…

HT Telugu Desk HT Telugu

21 November 2022, 13:37 IST

    • APPSC AMVI Posts ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ ఆధ‌్వర్యంలో చేపట్టిన అసిస్టెంట్‌ మోటర్ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల నియామక ప్రక్రియను  ఆంధ‌్రప్రదేశ్‌ హైకోర్టు రద్దు చేసింది.  ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో  ఏఎంవిఐ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ను అభ్యర్ధులు హైకోర్టులో సవాలు చేశారు. 
విజయవాడలోని ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయం
విజయవాడలోని ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయం

విజయవాడలోని ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయం

APPSC AMVI Posts అసిస్టెంట్ మోటర్ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ జారీ చేసిన 12/2022 నోటిఫికేషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. మొత్తం 15 డైరెక్ట్ పోస్టులతో పాటు 2 క్యారీ ఫార్వార్డ్ పోస్టుల భర్తీ కోసం గత సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో అభ్యర్థులు ఇంగ్లీష్‌లో మాత్రమే నియామక పరీక్షను రాయాల్సి ఉంటుందని పేర్కొనడంపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

రవాణా శాఖలోని అసిస్టెంట్‌ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.అయితే ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్ష రాయాలని ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ లో పేర్కొనడంపై కాశీ ప్రసన్నకుమార్ అనే వ్యక్తి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషనర్ తరపున లాయర్ జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కోర్టు తీర్పులకు విరుద్ధమని లాయర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. కేంద్రం జారీ చేసే నోటిఫికేషన్లు హిందీలో కూడా ఉంటాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలతో పాటు ఇతర పరీక్షల్ని కూడా ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారని వివరించారు. పిటిషనర్ల అభ్యంతరాల నేపథ్యంలో ఎపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

టాపిక్