తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Medical Colleges: ఈ ఏడాది ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభం - మంత్రి రజిని

AP Medical Colleges: ఈ ఏడాది ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభం - మంత్రి రజిని

HT Telugu Desk HT Telugu

01 June 2023, 19:03 IST

    • Medical Colleges in Andhrapradesh: రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభించనున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని

AP Medical Colleges: రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రకటించారు. విజయనగరం, నంద్యాల ,ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి మెడికల్ కాలేజీల్లో ఆగస్టులో సీట్లు భర్తీ చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ ఒకటి నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. కొత్తగా ప్రారంభం అయ్యే 5 మెడికల్ కాలేజీలు నుంచి 750 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి రజనీ వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

AB Venkateswararao : ఏపీ సర్కార్ కు షాక్, ఏబీవీ సస్పెన్షన్ కొట్టివేత-విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఆదేశాలు

AP PGECET 2024 : ఏపీ పీజీఈసెట్ కరెక్షన్ విండో ఓపెన్, మే 14 వరకు దరఖాస్తు సవరణలకు అవకాశం

AP Medical Colleges: ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్స్‌, ట్యూటర్‌ పోస్టులు

Bheemili Beach : మనసు దోచేస్తున్న భీమిలి బీచ్- విశాఖలోని టూరిస్ట్ ప్రదేశాలివే!

ఏపీ ప్రభుత్వం(AP Govt) 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని కళాశాలల నిర్మాణం మెుదలైంది. కొన్ని కళాశాలలకు అనుమతులు మంజూరు అయ్యాయి. ఇందులో భాగంగా ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఐదు వైద్య కళాశాలలు(Five Medical Colleges) ప్రారంభం కానున్నాయి. 2023-2024 విద్యా సంవత్సరం నుంచి 5 వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు మొదలు అవుతాయి.

మరోవైపు 2024-2025కు సంబంధించి ఐదు మెడికల్ కాలేజీలు సైతం ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. పాడేరు(Paderu), మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోనిలో మెుదలవుతాయి. పాడేరులో ఇప్పటికే ఉన్న 150 పడకల ఆసుపత్రికి అదనంగా 330 పడకలు ఏర్పాటు చేస్తారు. మిగిలిన మరో 7 వైద్య కళాశాలలను 2025-2026లోగా తీసుకువచ్చే అవకాశం ఉంది.

కొత్త వైద్య కళాశాల్లో అకడమిక్ కార్యకలాపాలపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభమయ్యే కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో మరో మూడు సంవత్సరాల్లో 750, 750 , 1050 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీనికోసం రూ.8,480 కోట్లు వ్యయం చేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరం నుంచి నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు రాజమండ్రిలో నూతన వైద్య కళాశాలలు అకడమిక్ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు యుద్ధప్రాదిపదికన ఆయా ప్రాంతాల్లోని జిల్లా ఆసుపత్రులు బోధన ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతున్నారు.