తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Outsourcing Employees : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై ప్రభుత్వం క్లారిటీ

Outsourcing Employees : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై ప్రభుత్వం క్లారిటీ

HT Telugu Desk HT Telugu

05 December 2022, 19:47 IST

    • Outsourcing Employees Discontinue : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై వివాదం నడుస్తోంది. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ దీనిపై క్లారిటీ ఇచ్చారు.
మంత్రి బొత్స, సజ్జల రామకృష్ణా రెడ్డి
మంత్రి బొత్స, సజ్జల రామకృష్ణా రెడ్డి

మంత్రి బొత్స, సజ్జల రామకృష్ణా రెడ్డి

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల(outsourcing jobs) తొలగింపుపై ప్రభుత్వం స్పందించింది. తాజాగా దీనిపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వంపై ఎందుకు అంత అక్కసు అని బొత్స ప్రశ్నించారు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నారని అడిగారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. రెండు లక్షల మందిని తీసేస్తున్నామని మీకు ఎవరు చెప్పారని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఉద్యోగులు(Employees) ప్రభుత్వ కుటుంబ సభ్యులేనని ఎవరూ అధైర్య పడొద్దని చెప్పారు. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడమే వారి లక్ష్యమన్నారు. ప్రజల్లో అశాంతి రేకెత్తించాలని చూస్తున్నారన్నారు. ఉద్యోగులను తొలగించాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. తొలగింపు మీద ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. 151 సీట్లు ఇచ్చి.. ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు.

'ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. ఉద్యోగుల తొలగింపుపై ఎలాంటి చర్చ రాలేదు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.' అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

స్కిల్ డెవలప్ మెంట్(Skill Developemt Scam) స్కామ్ అతిపెద్దది అని.. ఈ స్కామ్ లో రాజకీయ ప్రమేయం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని పేర్కొన్నారు. అతి త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. స్కామ్ లో చంద్రబాబు(Chandrababu) పాత్ర కచ్చితంగా ఉందని సజ్జల ఆరోపించారు. ఆయనకు తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందా అని ప్రశ్నించారు.

'కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన చెందొద్దు. సీమకు ఎవరు ఏం చేశారో ప్రజలు చెబుతారు. రాయలసీమ(Rayalaseema)కు చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. సీమ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర కచ్చితంగా ఉంది.' అని సజ్జల అన్నారు.