తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Judicial Academy In Kurnool : కర్నూలులో జ్యూడిషియల్ అకాడమీ ఏర్పాటు

Judicial Academy In Kurnool : కర్నూలులో జ్యూడిషియల్ అకాడమీ ఏర్పాటు

HT Telugu Desk HT Telugu

21 October 2022, 12:37 IST

    • Judicial Academy In Kurnool రాష్ట్రంలోని న్యాయాధికారులకు శిక్షణ ఇచ్చే రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీని శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జ్యూడిషియల్ అకాడమీ ఏర్పాటుకు జీవో
జ్యూడిషియల్ అకాడమీ ఏర్పాటుకు జీవో

జ్యూడిషియల్ అకాడమీ ఏర్పాటుకు జీవో

Judicial Academy In Kurnool ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వికేంద్రీకరణ విషయంలో ఏపీ ప్రభుత్వం మెల్లగా అడుగులు వేస్తోంది. న్యాయ కార్యకలాపాలను కర్నూలు కేంద్రంగా నిర్వహించాలని భావిస్తోన్న ఏపీ ప్రభుత్వం అందులో భాగంగా అడుగులు ముందుకు వేస్తోంది. శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో జ్యూడిషియల్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని న్యాయాధికారులకు శిక్షణ ఇచ్చే రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీని శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

AP Rains Alert: ఏపీలో చల్లబడిన వాతావరణం, పలు జిల్లాల్లో భారీ వర్షం- పిడుగుపాటు హెచ్చరికలు జారీ

AP RGUKT Admissions 2024 : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు, మే 8 నుంచి జూన్ 25 వరకు అప్లికేషన్లు స్వీకరణ

AP ECET 2024: రేపీ ఏపీ ఈసెట్‌ 2024, ఇప్పటికే హాల్‌ టిక్కెట్ల విడుదల చేసిన JNTU కాకినాడ

AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ 2024 సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేసిన జేఎన్‌టియూ కాకినాడ

అకాడమీని ప్రస్తుతానికి మంగళగిరిలో అద్దె భవనంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు రాష్ట్రంలో జ్యుడిషియల్‌ అకాడమీ లేదు. దీంతో రాష్ట్రంలో జ్యుడిషియల్‌ అకాడమీ ఏర్పాటుకు హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ సిఫారసులు పంపింది.

ఈ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో అకాడమీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్‌ పేరు మీద జీవో జారీ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జ్యుడిషియల్‌ అకాడమీలో ఉన్న సిబ్బందిలో 58.32 శాతం మించకుండా సిబ్బందిని మంజూరు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సిబ్బంది మంజూరు, మౌలిక సదుపాయాల కల్పన వివరాలతో తగిన ఉత్తర్వులను వేరుగా జారీ చేస్తామంది.

ఈ ఉత్తర్వులకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను కోరింది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే అక్కడ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాలను ఏర్పాటు చేసింది. కర్నూలు పూర్తి స్థాయిలో భవన నిర్మాణాలు పూర్తయ్యాక కార్యలయాలను అక్కడికి తరలించనున్నారు.

టాపిక్