తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp Sajjala : సమైక్యాంధ్ర వ్యాఖ్యలపై రాజకీయాలు అవసరం లేదన్న సజ్జల

YSRCP Sajjala : సమైక్యాంధ్ర వ్యాఖ్యలపై రాజకీయాలు అవసరం లేదన్న సజ్జల

HT Telugu Desk HT Telugu

12 December 2022, 20:58 IST

    • YSRCP Sajjala మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ వ్యాఖ్యల నేపథ్యంలోనే మాట్లాడాను తప్ప తన వ్యాఖ్యలను రాజకీయం చేయాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని అందుకు సిఎం జగన్మోహన్‌ రెడ్డి అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాలే కారణమని ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి
ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి

ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి

YSRCP Sajjala వైయస్ జగన్ పై ఉండవల్లి ఆరోపణలపై స్పందనగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాను తప్ప తన వ్యాఖ్యల్లో దురుద్దేశం లేదని సజ్జల స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం వైయస్ జగన్ మాత్రమే నిలబడ్డారని ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో మూడు,నాలుగు లక్షలమందితో పెద్ద బహిరంగ సభ జరిపి సమైక్యాంధ్ర కోసం నిలబడ్డారని చెప్పారు. అప్పటి ప్రభుత్వంలోని కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబునాయుడు, ఉద్యోగులను పాల్గొననీయకుండా చేసినా ప్రజలందర్ని కూడగట్టి వైయస్సార్ సిపి సభ నిర్వహించినట్లు చెప్పారు. రెండు రోజుల క్రితం ఉండవల్లి విమర్శలపై తాను ఏం చెప్పానో అదే స్టాండ్ పై నిలబడి ఉన్నానని తన వ్యాఖ్యలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

కేసీఆర్ పార్టీపై….

కేసిఆర్ స్ధాపించిన భారత రాష్ట్ర సమితిపై వైసీపీకి ఓ అభిప్రాయం ఉందని, బి ఆర్ ఎస్ కు మద్దతు ఇవ్వాలని అడిగితే ఏం చేయాలనే విషయమై అప్పుడు ఆలోచిస్తా మన్నారు. దీనిపై అందరితో చర్చించి వైయస్ జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు. వైయస్ జగన్ చెబుతున్నది ఒక్కటే అని, మాకు ఆంధ్రప్రదేశ్ ప్రధానమైందని, రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చే ఆలోచన వైయస్సార్ కాంగ్రెస్ కు లేదన్నారు. రాజకీయ పార్టీగా రాష్ట్రంలో ఏ పార్టీ అయినా పోటీ చేయవచ్చని, ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చన్నారు.

చంద్రబాబు ఆడించే ఆటబొమ్మైన పవన్ కల్యాణ్ ఇప్పడం గ్రామం వద్ద వెహికల్ టాప్ పై ఎక్కి ప్రయాణించాడని, తమకు ఎలాంటి రూల్స్ ఉండవు అనుకునే అరాచకపు బ్యాచ్ వైఎస్సార్సీపీ గురించి విమర్శించడం అనేది వారి వైఖరిని తెలియ చేస్తోందన్నారు. కేసులు బుక్ చేయడంలోగాని, ఇతర అంశాలలో పోలీసు యంత్రాగం నిష్పాక్షపాతంగా పనిచేస్తున్నారనేది అందరికి తెలుసని దానిపై టిడిపి, ఆ పార్టీ అనుకూల మీడియా బురద చల్లేందుకు దుష్ప్రచారం చేస్తున్నారనేది స్పష్టం అవుతుందన్నారు.

రెవిన్యూ విభాగంలో సంస్కరణలు….

భూ సర్వేతో రెవెన్యూ శాఖలో వైయస్ జగన్ సంస్కరణలు చేస్తున్నారని ఇది ఒక బృహత్తర భాధ్యత అన్నారు. సర్వే వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుందనేది అందరూ చూస్తున్నారని ఇంత పెద్ద యజ్ఞం జరుగుతున్నప్పుడు చిన్నచిన్న సమస్యలు ఉంటాయన్నారు. వైయస్ జగన్‌కు ప్రజల్లోమంచి పేరు వస్తుందనే దుర్భుద్దితో చేసే దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని భూముల రీ సర్వే పై ప్రతిపక్షాలు విమర్శలు సరికావన్నారు.

సైకోపాలన పోవాలి - సైకిల్ రావాలంటూ చంద్రబాబు చేసిన విమర్శ సరికాదని, ఎవరు సైకో అనేది చంద్రబాబు,ఆయన కొడుకు మాటలు చూస్తే అర్ధమవుతుందన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయంటూ చంద్రబాబు చేసిన విమర్శలు అవాస్తవమన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్ లోనే చెప్పారని ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో రైతులకోసం సున్నావడ్డి, పెట్టుబడి రాయితీ సహా పలు పథకాలు ఇస్తున్నారన్నారు. రైతులకు ప్రభుత్వంనుంచి రావాల్సినవి అన్నీ కూడా ప్రణాళికబద్దంగా వారికి అందచేస్తున్నారన్నారు.

కోవిడ్ అనంతరం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, ఈ విషయం ఉద్యోగులు,ఉపాధ్యాయులు అందరూ అర్ధం చేసుకున్నారని సజ్జల చెప్పారు. ఉద్యోగులు సంక్షేమ పథకాలను కిందిస్దాయికి తీసుకువెళ్లడంతోనే రైతులు గాని,పేద,ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటీ వర్గాలు ధీమాతో ఉండగలిగాయన్నారు. ఫైనాన్స్ క్రైసిస్ ఉన్నప్పటికి కోవిడ్ నేపధ్యాన్ని తీసుకుంటే గతంలో ఏ పాలకులు పరిపాలించిన సమయం కంటే కూడా రాష్ట్రం ఆర్దికంగా బాగానే ఉందన్నారు.

వాలంటీర్ల గురించి చేస్తున్న విమర్శలపై మాట్లాడుతూ 62 లక్షలమంది పెన్షనర్లు ఉన్నారని సంక్షేమ పధకాలు అందుకుంటున్న వారివద్దకు వెళ్లి ఈ మాటలు అంటే అలా మాట్లాడేవారిపై పేడనీళ్ళు చల్లుతారని సజ్జల చెప్పారు. 2014-19 మధ్య పెన్సన్ కావాలంటే పోస్టాఫీసు,మండలాఫీసులు వద్దకు వెళ్లి నిరీక్షించాల్సి వచ్చేదని, సభలకు హాజరైతే.... అదీ చివరివరకు కూర్చుంటే ఇస్తామని ఇబ్బంది పెట్టేవారన్నారు. మరోవైపు జన్మభూమి కమిటీలు దోచుకునేవి. తెలుగుదేశం పార్టీని చెత్తబుట్టలో వేయడానికి ఇదొక ప్రధాన కారణమన్నారు.

వారాహి ప్రచారం….

వారాహి అని ఎన్నికల కోసం ట్యాంకర్ లాగా చూపించి రాజకీయాలు చేయడమో, దాని ద్వారా జిమ్మిక్కులు చేయడమో జనంకు ఏదో జరుగుతుందనో వారు ప్రచారం చేసుకుంటున్నారని సజ్జల ఎద్దేవా చేశారు.

రుషికొండ విషయంలో వాటర్ మెన్ గా పిలవబడే రాజేంద్రసింగ్ గతంలో అమరావతి సందర్శించి పంటలు పండే ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తున్నట్లుగా కూడా మాట్లాడారని గుర్తు చేశారు.