తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Cm Jagan Released One Crore Rupees For Gauchers Disease Treatment Of 3years Child

AP CM Jagan : అరుదైన “గుషెర్స్‌” వ్యాధికి సిఎం జగన్ ఆపన్న హస్తం

B.S.Chandra HT Telugu

03 October 2022, 6:44 IST

    • Gaucher's disease అరుదైన గుషెర్స్‌ జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి ఏపీ సిఎం  జగన్మోహన్‌ రెడ్డి ఆపద్భాందవుడయ్యారు. పుట్టుకతో కాలేయ సమస్యతో బాధపడుతున్న చిన్నారి చికిత్స కోసం రూ.కోటి రుపాయల సాయాన్ని అందించారు.  అరుదైన కాలేయ వ్యాధి చికిత్స కోసం  కోటి రుపాయల వ్యయంతో చిన్నారికి చికిత్సను ప్రారంభించారు. 
గుషెర్స్‌ వ్యాధితో బాధ పడుతున్న చిన్నారి హానీ
గుషెర్స్‌ వ్యాధితో బాధ పడుతున్న చిన్నారి హానీ

గుషెర్స్‌ వ్యాధితో బాధ పడుతున్న చిన్నారి హానీ

Gaucher's disease అరుదైన గుషెర్స్‌ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రూ.కోటి మంజూరు చేశారు. ఈ డబ్బుతో అత్యంత ఖరీదైన 13 ఇంజెక్షన్లను తొలి విడతగా జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా బాధితులకు అందించారు.

ట్రెండింగ్ వార్తలు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

BR Ambedkar Konaseema బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేరానికి చెందిన కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మి దంపతుల రెండున్నరేళ్ల కుమార్తె హనీకి పుట్టుకతోనే గుషెర్స్‌ వ్యాధి ఉంది. ఈ వ్యాధి కారణంగా చిన్నారి కాలేయం పనిచేయదు.

ఇటీవల గోదావరి వరద Godavari floods బాధిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా గంటి పెద్దపూడిలో సీఎం జగన్‌ Cm Jagan పర్యటించారు. తిరుగు ప్రయాణంలో సీఎం ఉండగా, హనీ తల్లిదండ్రులు చిన్నారిని కాపాడాలంటూ ప్రదర్శించిన ప్లకార్డును సీఎం చూశారు. వెంటనే కాన్వాయ్‌ను ఆపి వారితో మాట్లాడారు . వారిని హెలిపాడ్‌ వద్దకు తీసుకురావాలని అక్కడున్న భద్రతా సిబ్బందిని ఆదేశించారు. హెలిపాడ్‌ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో సీఎం వారితో మాట్లాడి హనీకి సోకిన వ్యాధి, చేయాల్సిన వైద్యం గురించి ఆరా తీశారు.

చిన్నారి ప్రాణాలు నిలిపేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని, ఖర్చు ఎంతైనా పర్వాలేదని జిల్లాకలెక్టర్‌ హిమాన్షు శుక్లాను Himanshu Shukla సీఎం ఆదేశించారు. దీనికోసం ప్రతిపాదనలను వెంటనే పంపాలని ఆదేశించారు. కలెక్టర్‌ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, వాటిని మంజూరు చేసింది. హనీ వైద్యంకోసం కోటి రూపాయలు మంజూరుచేస్తూ ఆదేశాలు ఇచ్చిందని కలెక్టర్‌ వెల్లడించారు.

<p>అమలాపురం ఆస్పత్రిలో చిన్నారికి &nbsp;వైద్యం ప్రారంభం</p>

ఆదివారం అమలాపురంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చిన్నారి హనీకి ఇంజక్షన్లను కలెక్టర్‌ పంపిణీచేశారు. దేశంలో ఈ వ్యాధి చాలా అరుదుగా సంక్రమిస్తుందని దేశవ్యాప్తంగా ఇటువంటి వ్యాధితో బాధప డుతున్న వారు 14 మంది ఉన్నారని కలెక్టర్ హిమాన్షు శుక్లా చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి వైద్యం అందించడం అందించలేదని తొలుతగా స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి నందు ఈ తరహా వ్యాధి నివారణ చర్యలు ఆరంభమయ్యాయన్నారు.

కలెక్టర్‌ పంపిన ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. ఆ నిధులతో తెప్పించిన ఇంజెక్షన్లను జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా అమలాపురం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో హనీ తల్లిదండ్రులకు అందజేశారు. “గుషెర్స్‌” వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 52 ఇంజెక్షన్లు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్‌ చెప్పారు. ఒక్కో టి రూ.1.25లక్షలు ఖరీదు చేసే ఇంజక్షన్లను చిన్నారికి అందించనున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా చిన్నారికి ఇంజెక్షన్‌ ఇవ్వనున్నారు. చిన్నారి భవిష్యత్తు, విద్యాభ్యాసం కోసం సాయం అందించాలని సీఎం ఆదేశించారు.చిన్నారికి ప్రతి నెల రూ.10వేల పెన్షన్ ఇచ్చేందుకు ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ చెప్పారు.

పాప తండ్రి కొప్పాడ రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కలవగానే ఎంతో ఉదారంగా స్పందించి ఎంత ఖర్చయినా పర్వాలేదని భరోసా ఇచ్చారని, ప్రభుత్వపరంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారని చెప్పారు. భరోసా ఇచ్చిన రెండు నెలల్లో వైద్య సేవలు ఆరంభం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చిన్నారి తల్లి నాగలక్ష్మి మాట్లాడుతూ ఇటువంటి వ్యాధి ఏ ఒక్కరికి రాకూడదని అన్నారు. తమది పేద కుటుంబమని వైద్యం చేయించగల ఆర్థిక స్తోమత తమకు లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని అండగా నిలవడంతో చిన్నారి హనీ భవిష్యత్తు పై ఆశలు చిగు రుస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారు పాప తల్లిదండ్రులకు 13 ఇంజక్షన్లు అందజేశారు.

టాపిక్