తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cabinet Meeting : పేపర్​ లెస్ మీటింగ్...! ఈనెల 27న ఏపీ కేబినెట్ భేటీ

AP Cabinet Meeting : పేపర్​ లెస్ మీటింగ్...! ఈనెల 27న ఏపీ కేబినెట్ భేటీ

HT Telugu Desk HT Telugu

18 August 2024, 11:21 IST

google News
    • ఈనెల 27వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం కానుంది. పేపర్ లేకుండా(ఈ - కేబినెట్)నే ఈ భేటీ జరగనుంది. ఉద‌యం 11 గంట‌ల‌కు వెల‌గ‌పూడి రాష్ట్ర స‌చివాలయం భ‌వ‌నంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
ఏపీ కేబినెట్ సమావేశం
ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ కేబినెట్ సమావేశం

రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఈనెల 27న ఉద‌యం 11 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది. ఈ కేబినెట్ భేటీపై సీఎం చంద్ర‌బాబు నాయుడు మార్క్ ప‌డ‌నుంది. పేప‌ర్ ఏమీ(ఈ - పేపర్) లేకుండా ఈ-కేబినేట్ భేటీ నిర్వ‌హించ‌నున్నారు. పేప‌ర్ ర‌హిత కేబినెట్ స‌మావేశం అని చెప్పొచ్చు.

రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చి దాదాపు రెండు నెల‌లు అవుతుంది. ఈ నేప‌థ్యంలో ఒక్కొక్క‌టి త‌న పాత ప‌ద్ద‌తుల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అనుస‌రిస్తోన్నారు. అధికారుల‌తో స‌మావేశాలు, స‌మావేశాల్లో టెక్నాల‌జీ ఉప‌యోగం వంటి త‌న మార్క్ పాల‌న‌ను మ‌ళ్లీ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్ప‌టికే జిల్లా కలెక్ట‌ర్ల‌తో స‌మావేశం అయిన సీఎం చంద్ర‌బాబు… గ‌తంలో లాగా గంట‌ల త‌ర‌బ‌డి స‌మీక్ష‌లు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టికే నాలుగు ఢిల్లీ ప‌ర్యట‌న‌లు చేశారు. ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రుల‌తో భేటీ అయ్యారు. స‌రిగ్గా ఇలానే గ‌తసారి కూడా చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్యట‌నలు చేశారు. ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రుల‌తో వ‌రుస భేటీలు అయ్యేవారు. ఇప్పుడు కూడా స‌రిగ్గా అలానే ఢిల్లీ ప‌ర్య‌ట‌నలు చేస్తున్నారు.

ఇప్పుడు చంద్ర‌బాబు గ‌తంలో మాదిరిగా పేపర్ రహిత కేబినెట్ నిర్వహించనున్న‌ట్లు సర్క్యులర్ జారీ చేశారు. ట్యాబ్ ద్వారా కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 2024-19 మ‌ధ్య అధికారంలో ఉన్న‌ప్పుడు ఈ తరహా కేబినెట్ చంద్రబాబు నిర్వహించారు. ఆగ‌స్టు 27న (మంగ‌ళ‌వారం) ఉద‌యం 11 గంట‌ల‌కు వెల‌గ‌పూడి రాష్ట్ర స‌చివాలయం భ‌వ‌నంలో మొద‌టి అంత‌స్తులో కేబినెట్ మీటింగ్ హాల్ స‌మావేశం జ‌రుగనుంది.

ఆగ‌స్టు 23న సాయంత్రం 4 గంట‌ల‌కు డిపార్ట్‌మెంట్ ప్ర‌తిపాద‌న‌ల‌తో కూడిన పీడీఎఫ్, వ‌ర్డ్ ఫార్మెట్‌లో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జింటేష‌న్ (పీపీటీ) సాఫ్ట్‌కాపీ పూర్తి చేయాల‌ని, అన్ని డిపార్ట్‌మెంట్లకు ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీలు, సెక్ర‌ట‌రీలు ప్ర‌తిపాద‌న‌ల‌ను పంపాల‌ని సూచించారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీరభ్ కుమార్ ప్ర‌సాద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఏపీలో సెప్టెంబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పూర్తిస్థాయి బడ్జెట్‌పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్‌లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాలు జరపనుంది. ఈ నెల 31వ తేదీలోగా బడ్జెట్ అంచనాలను పంపాలని ఆర్థిక శాఖ కోరింది.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం