తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Bjp : వైసీపీఅరాచకాలపై పోరాటం….. సోము వీర్రాజు

AP BJP : వైసీపీఅరాచకాలపై పోరాటం….. సోము వీర్రాజు

HT Telugu Desk HT Telugu

19 November 2022, 7:47 IST

    • AP BJP ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అరాచక పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.  ప్రభుత్వ అరాచకాలపై  నియోజక వర్గ స్థాయి నుంచి ఛార్జిషీట్లు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. జగనన్న ఇళ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని జనసేన  చేపట్టిన సోషల్ ఆడిట్‌ను వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకోవడాన్ని   బీజేపీ నేతలు తప్పు పట్టారు. 
ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీటు సిద్ధం చేస్తామన్న బీజేపీ నేతలు
ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీటు సిద్ధం చేస్తామన్న బీజేపీ నేతలు

ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీటు సిద్ధం చేస్తామన్న బీజేపీ నేతలు

స్AP BJP ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న వారిపై అధికార పార్టీ దాడులకు పాల్పడుతోందని, జగనన్న ఇళ్ల నిర్మాణంలో లోపాలను బయటపెడుతున్న జనసేన పార్టీ కార్యక్రమాలను వైసీపీ అడ్డుకోవడాన్ని బీజేపీ నేతలు తప్పు పట్టారు. వైసీపీనాయకులు ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తుందని హెచ్చరించారు.

వైసీపీ మత రాజకీయాలు చేస్తోందని సోము వీర్రాజు మండిపడ్డారు. రూ175కోట్ల రుపాయల ప్రభుత్వ నిధులను చర్చిల నిర్మాణాలకు కేటాయించడం వైసీపీ మతతత్వ వైఖరికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయస్థానంలో పోరాటం చేస్తామని ప్రకటించారు. నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడ విమానాశ‌్రయం నుంచి పెద్ద ఎత్తున నల్లధనం తరలిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ మధ్యం కుంభకోణం నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి బయటపడిందన్నారు. ఎయిర్‌ పోర్ట్‌లో భద్రతను సిఐఎస్‌‌ఎఫ్‌ బలగాలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రజాపోరు పేరుతో సభలు, ఆందోళనకార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రం లో విచ్చలవిడిగా అవినీతి ‌జరుగుతుందని ఆధారాలతో‌ చెబుతున్నామని, ప్రజాపోరు సభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రజలకు వివరించామని ఎంపీ జివిఎల్ నరసింహరావు చెప్పారు. వైసిపి వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతూ కార్యాచరణ సిద్దం చేశామన్నారు. ఎక్కడిక్కడ పోరాటాలు చేసి, ప్రభుత్వం తీరు పై ఉద్యమిస్తామన్నారు.

రాష్ట్రం లో బిజెపి ప్రత్యామ్నాయ శక్తి గా ఎదుగుతుందని, గన్నవరం విమానాశ్రయం లో స్థానిక పోలీసులుతో రక్షణ ఎందుకు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. టిడిపి, వైసిపి ప్రభుత్వం హయాంలో అనేక ఆరోపణలు వచ్చాయని, ఈ వ్యవహారంపై కేంద్ర విమానయానశాఖ మంత్రి కి లేఖ రాసినట్లు జివిఎల్ చెప్పారు. రాష్ట్రంలో రెండు వేల నోట్లు ఎందుకు కనిపించకుండా పోయాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఆర్.బి.ఐ ద్వారా విచారణ చేయాలని కోరతామన్నారు. జగన్ ప్రభుత్వం వైఫల్యం పై ఛార్జిషీట్ ప్రకటిస్తామన్నారు.

టిడిపికి సొంత ప్రయోజనాలు తప్ప, ప్రజల‌ ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. మోడీ విశాఖ పర్యటన తరువాత ప్రజల్లో మార్పు కనిపిస్తుందని, 2024లో ఏపీలో మోడీ మ్యాజిక్ పని చేస్తుందన్నారు. బిజెపి, జనసేన భాగస్వామ్యం తో అధికారంలోకి వస్తామన్నారు. టిడిపి పూర్తి అభద్రతా భావంతో ఉందని, వారిలో నాయకత్వం క్షీణిస్తుందని జివిఎల్ చెప్పారు. టీడీపీది నిరాశపూరిత గతమైతే, వైసీపీది భరించలేని వర్తమానం అన్నారు. అందరూ ఎదురు‌ చూసే భవిష్యత్తు బిజెపి, జనసేనలదని జివిఎల్ చెప్పారు.

వైసిపి, టిడిపి లు రెండూ కుటుంబ పార్టీలేనని, కుట్ర పార్టీలేనన్నారు. ఏపీలో నిజమైన రాజకీయ ప్రత్యామ్నాయం ఒక్క బిజెపి తోనే సాధ్యమన్నారు. రాష్ట్రం లో కాపులకు, బిసిలకు, ఎస్సీ,ఎస్టీలకు న్యాయం జరగడం లేదని, అన్ని వర్గాల వారికి న్యాయం చేయడం బిజెపి, జనసేన కూటమికే సాధ్యమన్నారు. అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించే కార్యాచరణ సిద్దం గా ఉందని, యనమల వంటి వారికే సీటు లేదని చంద్రబాబు అంటున్నారని, వైసిపి లో కేవలం ఒక వర్గానికే పదవులు మొత్తం ఇస్తున్నారని ఆరోపించారు.