తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Administrative Capital Will Work From Visakhapatnam By Next Academic Year

Gudivada Amarnath : వచ్చే విద్యా సంవత్సరానికి విశాఖ నుంచి పరిపాలన…. అమర్‌నాథ్‌

HT Telugu Desk HT Telugu

12 December 2022, 21:50 IST

    • Gudivada Amarnath వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన కొనసాగుతుందని, ఇదే జరగబోయేదని మంత్రి అమర్‌ నాథ్‌ స్పష్టం చేశారు. పవన్‌కళ్యాణ్‌ ప్రచార రథం వారాహికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఇక్కడికి వస్తే, ఇక్కడి నియమావళి ప్రకారం ఉందా లేదా అని చూస్తామన్నారు. చంద్రబాబు సైకిల్‌ తుప్పు పట్టిపోయిందని ఆయన ఎప్పుడు, ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్ధం కావడం లేదని, తనకు వచ్చేవే చివరి ఎన్నికలు అని మళ్లీ మాట మార్చి, ఆ ఎన్నికలు చివరి రాష్ట్రానికి చివరి ఎన్నికలు అని అంటున్నాడని ఎద్దేవా చేశారు.
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

Gudivada Amarnath విశాఖ వేదికగా ఏ నిర్మాణాలు జరగకూడదని, అక్కడ అభివృద్ధి పనులు జరగకూడదని, ఆ ప్రాంతానికి పేరు రాకూడదని అక్కడ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ రావొద్దనేదే వారి టార్గెట్‌ అని మంత్రి గుడివాడ అమర్‌ నాథ్ ఆరోపించారు. వచ్చే విద్యా సంవత్సరం కల్లా విశాఖ రాజధాని రావడం ఖాయమన్నారు. అందుకే ఎవరెవరినో తీసుకొచ్చి, అక్కడ నిలబెట్టి ఫోటో తీసి కావాల్సిన కవితలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

AP EMRS Inter Admissions : ఏపీ ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు-మే 3 నుంచి దరఖాస్తులు ప్రారంభం

AP Govt Salaries: ఎలక్షన్ ఎఫెక్ట్‌... ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, సర్వీస్ పెన్షన్లు... ఐదేళ్లలో ఇదే రికార్డ్

Papikondalu Tour Package : గోదావరిలో పాపికొండల మధ్య బోటు ప్రయాణం- రాజమండ్రి నుంచి ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

AP Inter Supplementary: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్, నేడు కూడా సప్లిమెంటరీ ఫీజు కట్టొచ్చు…

విశాఖ గర్జన తర్వాత జరిగిన పరిణామాలు. అమరావతి టు అరసవెల్లి డ్రామా యాత్రకు తెర పడిందని, కోర్టు అనుమతి ఇచ్చినా, ముఖం చెల్లక యాత్రను తిరిగి కొనసాగించలేదన్నారు. అది పాదయాత్ర కాదని దండయాత్ర అని ఉత్తరాంధ్ర వాసులు తేల్చి చెప్పడంతో వారు తమ యాత్ర తాత్కాలికంగా విరమించుకున్నారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మాభిమానం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న వారి నినాదం ముందు వారు తప్పకుండా తలవంచాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. .

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీపీఐ నేత కె.నారాయణ స్వయంగా పర్యటించి, రుషికొండ సందర్శించి, అక్కడ కేవలం ప్రభుత్వ నిర్మాణాలు మాత్రమే సాగుతున్నాయని చెప్పారని అయితే ఆయన మాటలు చంద్రబాబునాయుడికి, నచ్చలేదని దీంతో ఈ రాష్ట్రంలో వాళ్ళు తెలుగువాళ్ళు అయితే లాభం లేదని, ఎక్కడో రాజస్థాన్ లో ఉన్న రాజేంద్రసింగ్‌ అనే మిత్రుడ్ని పట్టుకువచ్చారన్నారు.

ఇదే రాజేంద్రసింగ్‌.. అమరావతి ప్రాంతంలో రాజధాని పేరుతో ఏటా మూడు పంటలు పండే అత్యంత సారవంతమైన భూమిని వేలకు వేల ఎకరాలు సేకరించినప్పుడు ఎక్కడికి పోయారని అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్లిపోయారని ఎందుకు వచ్చి కన్నీరు కార్చలేదన్నారు.

రుషికొండపై జరుగుతున్నవన్నీ పర్యాటక శాఖకు చెందిన నిర్మాణాలేనని కానీ గతంలో అక్కడ అలా ఏ నిర్మాణాలు జరగనట్లు, ఇప్పుడు నిర్మాణాలతో అక్కడ నష్టం జరుగుతోందని, ఆ ప్రాంతం మీద వారికేదో ప్రేమ ఉన్నట్లు చేస్తున్న డ్రామా చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. రుషికొండలో నాలుగు నిర్మాణాలు జరిగితే, రాష్ట్రానికి, దేశానికి ఏదో నష్టం జరిగినట్లు వ్యవహరిస్తున్నారన్నారు.

విశాఖలో సముద్రం చేరువలో, తీరంలో అనేక కొండలు ఉన్నాయని వాటన్నింటిపై అనేక నిర్మాణాలు ఉన్నాయని చివరకు రుషికొండ పక్కనే ఉన్న కొండపై టీటీడీ ఆలయ నిర్మాణం జరుగుతోందని గుర్తు చేశారు.

విశాఖ అభివృద్ధి చెందింది అంటే కేవలం వైయస్సార్‌ హయాంలోనే అని ఐటీ కంపెనీలు వచ్చాయని బీచ్‌ రోడ్‌ 4 లైన్లుగా మార్చారని ఇప్పుడు దాన్ని 6 లైన్లుగా మారుస్తూ, భోగాపురం వరకు విస్తరిస్తున్నామన్నారు. చంద్రబాబు ఒక్కటంటే ఒక్క పని చేయలేదని అక్కడ అభివృద్ధి జరుగుతుంటే, ఒకటే ఏడుపు అన్నారు.

టాపిక్