తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh State Level Police Recruitment Board Issuing Hall Tickets For Constable Jobs

Constable Hall Tickets : ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఐదు లక్షల దరఖాస్తులు….

HT Telugu Desk HT Telugu

12 January 2023, 20:07 IST

    • Constable Hall Tickets ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల్లో భాగంగా  ప్రాథమిక రాతపరీక్షకు హాల్‌ టిక్కెట్లను జారీ చేస్తున్నట్లు ఏపీ స్టేట్‌ లెవల్ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. నేటి నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఐదు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా ఒక్కో ఉద్యోగానికి  82.5 మంది పోటీ పడుతున్నారు. 
కానిస్టేబుల్ ఉద్యోగాలకు హాల్ టిక్కెట్లు విడుదల
కానిస్టేబుల్ ఉద్యోగాలకు హాల్ టిక్కెట్లు విడుదల

కానిస్టేబుల్ ఉద్యోగాలకు హాల్ టిక్కెట్లు విడుదల

APSLLPRB Hall Tickets ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాల్ టిక్కెట్లు జారీ చేస్తున్నారు. ఏపీలో పోలీస్‌ కానిస్టేబుల్ నియామకాలలో భాగంగా ప్రాథమిక రాత పరీక్షల నిర్వహణకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 3580 సివిల్‌ పోలీస్‌ కానిస్టేబుల్ పోస్టులతో పాటు 2520 ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల నియామకాల కోసం గత ఏడాది నవంబర్ 28న నోటీఫికేషన్ విడుదలైంది. మొత్తం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఈ ఏడాది జనవరి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరించారు.

కానిస్బేబుల్‌ నియామకాల్లో భాగంగా ప్రాథమిక రాత పరీక్షను జనవరి 22వ తేదీన ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జనవరి 12 నుంచి 20వ తేదీ వరకు హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌ టిక్కెట్లను https://slprb.ap.gov.in/నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌ టిక్కెట్లను డౌన్‌ లోడ్ చేసుకోడానికి 9రోజులు గడువు ఉన్నట్లు ప్రకటించారు.

మూడు భాషల్లో పరీక్ష…ఐదు లక్షల ఉద్యోగాలు…

పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో పరీక్షను రాసేందుకు అనుమతిస్తారు. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 3,64,184 మంది అభ్యర్థులు తెలుగులో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. 1,39,075 మంది ఇంగ్లీష్‌లో పరీక్ష రాయనున్నారు. 227మంది అభ్యర్థులు ఉర్దూలో పరీక్షను రాసేందుకు ఎంచుకున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మొత్తం 5,03,486మంది కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సగటున ఒక్కో ఉద్యోగానికి ప్రాథమిక స్థాయిలో 82.5 మంది పోటీ పడుతున్నారు.

పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో 3,95,415మంది పురుషులు, 1,08,071 మంది మహిళలు ఉన్నారు. రిజర్వేషన్ క్యాటగిరీల వారీగా దరఖాస్తు చేసిన వారిలో ఓసీ అభ్యర్థులు 53,778, బీసీ అభ్యర్థులు 2,74,567మంది , ఎస్సీ అభ్యర్థులు 1,31,875మంది, ఎస్టీలు 43,266మంది ఉన్నారు.

కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు 13,961మంది, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు 1,55,537, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు 2,97,655మంది, ఇతరులు 36,333మంది ఉన్నారు.

కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిలో జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి 50,268, విజయనగరం నుంచి 40,321, విశాఖపట్నం నుంచి 50002, తూర్పు గోదావరి నుంచి 42,501, పశ్చిమ గోదావరి నుంచి 27,504, కృష్ణా జిల్లా నుంచి 34,791, గుంటూరు నుంచి 37,526, ప్రకాశం జిల్లా నుంచి 33,484, నెల్లూరు జిల్లా నుంచి 25,132, కర్నూలుజిల్లా నుంచి 51,972, కడప జిల్లా నుంచి 27,217, అనంతపురం నుంచి 41,133, చిత్తూరు జిల్లా నుంచి 33,934, ఇతర రాష్ట్రాల నుంచి 7701 దరఖాస్తులు అందాయి

టాపిక్