తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Cabinet Meet Cm Jagan Ministers Discussed Key Decisions Like Ammavodi Groups Notifications

AP Cabinet Meet : కొత్త పెన్షన్ విధానం, 6840 పోస్టుల భర్తీ- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలివే!

07 June 2023, 13:51 IST

    • AP Cabinet Meet : ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, అమ్మఒడి పథకంతో కొత్త పెన్షన్ బిల్లుపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
సీఎం జగన్
సీఎం జగన్

సీఎం జగన్

AP Cabinet Meet : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణతో పాటు చిత్తూరు డెయిరీ భూములు లీజ్ కు ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించింది. 2014 జూన్‌ 2 నాటికి 5 ఏళ్ల సర్వీస్ పూర్తయిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలనే నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సీపీఎస్‌ స్థానంలో తీసుకొచ్చిన జీపీఎస్‌లో మార్పులు చేర్పులపై కేబినెట్ చర్చింది. కొత్త పెన్షన్ విధానం కోసం బిల్లు తీసుకురావాలని సీఎం జగన్ నిర్ణయించారు. అమ్మఒడి ఆర్థికసాయంపై చర్చించారు. మరోవైపు గురుకులాలు, విశ్వవిద్యాలయాల నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనపై కేబినెట్ లో చర్చించినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

NEET UG Admit Card 2024 : నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య

గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీపై

కేబినెట్ సమావేశంలో అమ్మ ఒడి పథకం అమలుకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది విద్యాకానుక పంపిణీ, గ్రూప్‌-1, 2 పోస్టుల భర్తీకి కేబినెట్‌ లో చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ బదులు, జీపీఎస్‌ అమలుపై మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసింది. బుధవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. సీపీఎస్‌ రద్దుపై నేడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్‌ విధానానికి బిల్లు తీసుకురావాలని నిర్ణయించింది.

కొత్త పెన్షన్ విధానం

రాష్ట్రంలో 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ. 6,888 కోట్లు రిలీజ్ చేసేందుకు మంత్రి మండలి ఆమోదించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ. 445 కోట్ల రుణాల కోసం ఏపీఎఫ్ఎస్ఎల్ కు కేబినెట్ అనుమతించింది. కొత్త మెడికల్ కళాశాలలకు 706 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. చిత్తూరు డైరీ ప్లాంటుకు చెందిన 28 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చేందుకు కేబినెట్ అనుమతించింది. జూన్ 12 నుంచి 17 వరకు జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వాహణ, పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులు ప్రదానం ఇలా పలు కీలక ఆంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా రూ.5 వేల కోట్ల రుణ సేకరణకు మంత్రి వర్గం అనుమతించింది. ప్రభుత్వ పెన్షన్‌ విధానంపై బిల్లు రూపొందించేందుకు కేబినెట్ ఆమోదింది. 'ఏపీ గ్యారెంటీడ్‌ పెన్షన్‌ బిల్లు-2023' పేరుతో కొత్త పెన్షన్‌ విధానం అమలుకు మంత్రివర్గం నిర్ణయించింది.

కొత్తగా 6840 పోస్టుల భర్తీ

ఇవాళ జరిగిన కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 63 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త గా 6840 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2014 జూన్ 2 తేదీ నాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదించింది. ఏపీ వైద్య విధాన పరిషత్ చట్టాన్ని రద్దు చేసి దాన్ని ప్రభుత్వ శాఖగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అందులోని ఉద్యోగులకు 010 హెడ్ నుంచి వేతనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వారి వేతనం లో 50 శాతం పెన్షన్ గా నిర్ధారిస్తూ కేబినెట్ నిర్ణయించింది. 16 శాతం హెచ్ఆర్ఏను అన్ని జిల్లాల కేంద్రాలకు అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

అమూల్ కు 28 ఎకరాలు

ప్రతీ మండలంలో రెండు జూనియర్ కళాశాలల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 3 నుంచి 10 తరగతి విద్యార్థులకు టోఫెల్ కు శిక్షణ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒడిషా రైలు దుర్ఘటన మృతులుకు కేబినెట్ సంతాపం తెలిపింది. చిత్తూరు డైరీ నిర్వహణ అమూల్ కు ఇస్తూ 28 ఎకరాల భూమిని 99 ఏళ్లకు లీజుకు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటు అయిన మెడికల్ కళాశాలలకు 2118 పోస్టుల భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు ప్రోత్సాహంగా ఆణిముత్యాలు అవార్డులు అందించనున్నారు. జూన్ 12 నుంచి 17 వరకూ విద్యా కానుక వారోత్సవాలు, అమ్మ ఒడి ఆర్థిక సహకారాన్ని జూన్ 28 తేదీన ఇవ్వాలనీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 476 జూనియర్ కళాశాలలో వాచ్ మెన్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రీన్ హైడ్రోజెన్, అమ్మోనియా పాలసీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. హైడ్రోజెన్, అమ్మోనియా ఉత్పత్తి పరిశ్రమలకు ప్రోత్సాహం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సదుపాయం 5జీ నెట్ వర్క్ కల్పించేందుకు ఏపీఎఫ్ఎస్ఎల్ రూ.445 కోట్ల రుణ సేకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఏపీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ తెలిపారు.